ది రాజా సాబ్ సెన్సార్ కంప్లీట్.. ఈ రిపోర్ట్ అస్సలు ఊహించిఉండరు..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ది రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి మారుతి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్ , వృద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో హర్రర్ కంటెంట్ విపరీతంగా ఉన్నట్లయితే ఆ మూవీ లకు సెన్సార్ బోర్డు వారు "ఏ" సర్టిఫికెట్ను జారీ చేస్తూ ఉంటారు. ఈ సినిమా హార్రర్ , కామెడీ జోనర్లో రూపొందడంతో ఈ మూవీ కి ఏ సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలియడంతో ఈ సినిమాలో హర్రర్ కంటెంట్ కంటే కూడా కామెడీ కంటెంట్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: