హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఫ్లాప్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన కీర్తి సురేష్..చేసిన అన్ని సినిమాలు ఫట్..!

Thota Jaya Madhuri
ఈ ఏడాది కీర్తి సురేష్‌కు అసలు కలిసి రాలేదని స్పష్టంగా చెప్పాల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా మంచి విజయాలు సాధించిన ఆమె, ఈ ఏడాదిలో నటించిన సినిమాలు మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేకపోయాయి. ఒక స్టార్ హీరోయిన్‌గా, నేషనల్ అవార్డు గెలుచుకున్న నటిగా ఆమెపై ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉండగా, ఆ అంచనాలను ఈ ఏడాది సినిమాలు తీరుస్తలేకపోయాయి అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.


ఈ ఏడాది కీర్తి సురేష్ నటించిన సినిమాల్లో ఒక్కటీ కూడా బాక్సాఫీస్ దగ్గర గానీ, ప్రేక్షకుల మనసుల్లో గానీ బలమైన ముద్ర వేయలేకపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా “రివాల్వర్ రీటా” సినిమా విషయంలో ఆమెతో పాటు అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ ఒక పవర్‌ఫుల్, డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తుందని, ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని భావించారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది.“రివాల్వర్ రీతా” సినిమా విడుదలైన తర్వాత, అది కీర్తి సురేష్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కథ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో సరైన బలం లేకపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లోపించడంతో సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కీర్తి సురేష్ నటన బాగున్నా, మొత్తం సినిమానే బలహీనంగా ఉండటంతో ఆమె నటన కూడా పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది.



అంతకు ముందు ఆమె నటించిన “ఉప్పుకప్పురంబు” సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటిటిలో విడుదలైంది. ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక ఫుల్ కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లా అనిపించింది. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై కొంత ఆసక్తి ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ సినిమా కూడా కీర్తి సురేష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ మార్కులు వేయలేకపోయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి సురేష్ సొంత అభిమానులే “ఈ సినిమాలో కీర్తి సురేష్ ఎందుకు నటించింది రా బాబు?” అని మాట్లాడుకునే పరిస్థితి రావడం. ఇది ఆమె ఇమేజ్‌కు కొంత మేర దెబ్బతీసిందనే చెప్పాలి. ఒకప్పుడు కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందని పేరున్న కీర్తి సురేష్, ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుందో అన్న ప్రశ్నలు అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా వినిపించాయి.


ఈ వరుస నిరాశల తర్వాత కీర్తి సురేష్ కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ “రివాల్వర్ రీటా” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఆమె కూడా చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపించింది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంది. ఇంటర్వ్యూలు, మీడియా మీట్స్, ఈవెంట్స్ అంటూ సినిమాను ప్రమోట్ చేయడంలో ఎలాంటి తగ్గుదల చూపలేదు.కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం ఆమెకు అనుకూలంగా రాలేదు. “రివాల్వర్ రీటా” సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. కొంతమంది ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా, ఎక్కువ శాతం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను సగటు స్థాయిలోనే ఉందని అభిప్రాయపడ్డారు. కథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, టేకింగ్ బలహీనంగా ఉండడం వంటివి సినిమాకు ప్రధాన మైనస్‌లుగా మారాయి.



ఫలితంగా ఈ సినిమా కూడా కీర్తి సురేష్ ఖాతాలో మరో నిరాశగానే మిగిలిపోయింది. ఈ ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే, ఆమెకు చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా లేకపోవడం ఆమె కెరీర్‌లో అరుదైన విషయం. అందుకే సోషల్ మీడియాలో “ఈ ఏడాది ఫ్లాప్స్ క్వీన్‌గా కీర్తి సురేష్ మిగిలిపోయింది” అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది. ఇలాంటి ట్రోల్స్ ఆమె అభిమానులను కూడా బాధపెట్టాయి.మొత్తానికి ఈ ఏడాది కీర్తి సురేష్‌కు పూర్తి స్థాయిలో కలిసిరాలేదనే చెప్పాలి. వరుసగా వచ్చిన సినిమాలు ఫలితం ఇవ్వకపోవడంతో, ఆమె తదుపరి సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సరైన కథ, బలమైన పాత్ర, మంచి దర్శకుడు లభిస్తే మాత్రం కీర్తి సురేష్ మళ్లీ తన సత్తా చాటుతుందని ఆమె అభిమానులు ఇప్పటికీ నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: