శివాజీ అంటే విష్ణు కి ఎంతో ప్రేమో.. సామాన్లు కామెంట్ పై ఎలా కవర్ చేశారో చూడండి..!
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన ఉద్దేశం మంచిదేనని, సంప్రదాయ దుస్తుల గొప్పతనాన్ని చెప్పడానికే అలా మాట్లాడారని సమర్థించగా, మరికొందరు మాత్రం ఆయన మాటలు మహిళల స్వేచ్ఛను హరించేలా, అవమానించేలా ఉన్నాయని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళల హక్కుల సంఘాలు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఖండించారు.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ అంశంపై అధికారికంగా స్పందించింది. ‘దండోరా’ సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేశానని శివాజీ వివరణ ఇచ్చినట్లు తెలిపింది. తన ఉద్దేశం మంచిదేనని, అయితే తాను ఉపయోగించిన భాష సరికాదని శివాజీ అంగీకరించినట్లు కూడా అసోసియేషన్ పేర్కొంది. తన మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే క్షమించాలని శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారని వెల్లడించింది.
ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోరింది. ఇక శివాజీ ఇచ్చిన వివరణతో పాటు ఆయన క్షమాపణల వీడియోను మా అధ్యక్షుడు మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వివాదం ఇక ముగుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా స్పందించింది. శివాజీ వ్యాఖ్యలపై విచారణ చేపట్టేందుకు ఆయన హాజరుకావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లోనే కాకుండా సమాజవ్యాప్తంగా మహిళల గౌరవం, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై చర్చకు దారితీశాయి. ఈ వివాదం భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మంచు విష్ణు కి శివాజి అంటే ఇష్టమెమో అని మాట్లాడుతున్నారు. ఇంత సీరియస్ ఇష్యూ పై ఇంత కూల్ గా స్పందించడం అందరికి షాకింగా ఉంది..!!