ఇంటర్వ్యూ : ఆది సాయి కుమార్ - ‘శంబాల’ను థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ ..!

RAMAKRISHNA S.S.
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ‘శంబాల’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన సంగతులివే..


‘శంబాల’పై మంచి బజ్ ఏర్పడింది ? ఈ చిత్రంపై పెరిగిన అంచనాల గురించి మీరేం చెబుతారు ?
- ‘శంబాల’ చిత్రం బాగా వచ్చింది. ఆడియెన్స్‌కి మా సినిమా బాగా నచ్చుతుంది. అందరూ మా మూవీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
‘శంబాల’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ వైరల్ అయింది కదా ? సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టున్నారు?
- ‘శంబాల’ స్టిల్ వదిలిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ గారు, ప్రభాస్ గారు, నాని గారు వదిలిన టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఆడియెన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ ఏర్పడింది. ఈ సారి మేం మంచి విజయాన్ని అందుకోబోతోన్నామనే కాన్ఫిడెన్స్ ఉంది.


‘శంబాల’ మ్యూజిక్ గురించి చెప్పండి ?
- ‘శంబాల’లో సాంగ్స్ ఎక్కువగా ఉండవు. ప్రమోషనల్ సాంగ్ అని అనుకున్నాం. కానీ మాకు అంత టైం సరిపోలేదు. అయినా ఇలాంటి జానర్ చిత్రాలకు హుక్ స్టెప్స్, సాంగ్స్ సెట్ అవ్వవేమో. కానీ ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతోంది. సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటారు.
‘శంబాల’ విషయంలో డైరెక్టర్ గారితో మీ జర్నీ ఎలా ఉంది.. ?
- యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. యుగంధర్ గారి మొదటి చిత్రం నాకు చాలా ఇష్టం. ఈ కథ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చెప్పిన కథను తెరపై చూపించారు. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు.


‘శంబాల’ విషయంలో నిర్మాతల సహకారం గురించి చెప్పండి.. ?
- నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ‘శంబాల’ని నిర్మించారు. మేం ఎక్కడా కూడా వేస్టేజ్ చేయకుండా సినిమాను తీశాం. నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ డేట్‌కి చాలా కాంపిటీషన్ ఏర్పడింది. మేం సినిమాని కష్టపడి చేశాం. ఆల్రెడీ చిత్రాన్ని చూశాం. మేం సినిమా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. హిందీలోనూ మా మూవీని ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ముందుగా రిలీజ్ చేస్తున్నాం. ఆ తరువాత హిందీలో విడుదల చేయబోతోన్నాం.
డిసెంబర్ 25కి చాలా కాంపిటీషన్ ఉంది కదా? వేరే డేట్ ఏదైనా మళ్లీ అనుకున్నారా.. ?
- డిసెంబరర్ 25 డేట్‌ని వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ నాకు దగ్గర్లో కనిపించలేదు. మేం ప్రీమియర్లతో ముందుకు వస్తున్నాం. ఇప్పటికే ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ బయటకు వెళ్తే.. డే వన్ నుంచే పికప్ అవుతుంది. కానీ ఈ డేట్‌కి టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది.


‘శంబాల’ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లు ఏంటి.. ?
- ‘శంబాల’ సినిమాను దాదాపు విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. క్లైమాక్స్ పార్ట్ మొత్తం నైట్ షూట్‌లోనే జరిగింది. ఎంత కష్టమైనా కూడా అందరం ఇష్టంతో కలిసి పని చేశాం.
‘శంబాల’ పార్ట్ 2 తీస్తారా.. ?
- ‘శంబాల’ని ఆడియెన్స్ హిట్ చేస్తే.. పార్ట్ 2 ప్లాన్ చేస్తాం.
తదుపరి చిత్రాల గురించి చెప్పండి.. ?
- ప్రస్తుతం ఈటీవీ విన్‌కి ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: