వేణు స్వామి పూజల పై.. నటి ప్రగతి కౌంటర్..!
అయితే ఈ విషయం పైన వేణు స్వామి మాట్లాడుతూ ప్రగతి కష్టపడిన కష్టాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రగతి తన కెరియర్ ఎదుగుదలతో పాటు, రేసింగ్ లో కూడా గెలవాలని తన దగ్గర వచ్చి పూజ చేయించుకుంది అంటూ తెలియజేశారు. ఆ పూజ ఫలితమే ప్రగతి 4 పథకాలు సాధించేలా చేసిందంటూ చెప్పుకోచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంపై ఈ విషయంపై నటి ప్రగతి మాట్లాడుతూ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.
సుమారుగా రెండు సంవత్సరాల ముందు తాను కష్టలలో ఉన్నాను, దీంతో తన స్నేహితులు రిఫర్ చేయడంతో తాను వేణుస్వామి దగ్గరికి వెళ్లాను, ( నాకే కాదు ఆ సమయంలో ఎవరికైనా తట్టే ఆలోచన పూజ చేయించుకోవడం) స్వామి ఏదో పూజ చేశారు. కానీ నాకు పెద్దగా ఫలితం కనిపించలేదు ఏడాది క్రితం జరిగిన ఈ పూజల ఫోటోలు ఇప్పుడు మళ్లీ షేర్ చేస్తున్నారు. అలాంటి వాటి గురించి తాను ఏం మాట్లాడగలను? అంటూ తెలిపింది.
ప్రగతి సాధించిన మోడల్స్ కి కారణం తానే అంటూ వేణు స్వామి చేసిన కామెంట్ల పై ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని.. మన టైమ్ బాగా లేకపోతే ఇలాంటి జ్యోతిష్యాలనే కాకుండా అన్నిటినీ కూడా నమ్ముతామంటూ తెలియజేసింది. ప్రస్తుతం వేణు స్వామి చేసిన కామెంట్స్ కు నటి ప్రగతి ఇన్ డైరెక్ట్ క్లారిటీ ఇచ్చింది.