RIP శివాజీ గారు అంటూ నటి సంచలన పోస్ట్.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar

దండోరా మూవీ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే శివాజీ, ఈ వేదికపై మహిళలను ఉద్దేశించి వాడిన  పదజాలం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేయగా, తాజాగా నటి రేఖా భోజ్ ఈ వివాదంలోకి ప్రవేశించి శివాజీపై నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

రేఖా భోజ్ తన పోస్ట్‌లో శివాజీ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఆడవాళ్లను ఉద్దేశించి "దరిద్రపు ముండలు, సామాన్లు" అంటూ అచ్చ తెలుగులో అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి, క్షమాపణలు చెప్పేసరికి మాత్రం "I apologise" అంటూ ఇంగ్లీషులో ముగించేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఆడవారిని కించపరిచినందుకు కనీసం తెలుగులో "నన్ను క్షమించండి" అని మనస్ఫూర్తిగా అడగడానికి కూడా ఆయన అహం అడ్డొస్తోందని ఆమె మండిపడ్డారు. కేవలం శివాజీ వ్యాఖ్యలనే కాకుండా, ఆ వీడియో కింద ఆయనను సమర్థిస్తూ వస్తున్న కామెంట్లను చూసి కూడా ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సమాజంలో ముసుగేసుకున్న తాలిబన్ వెధవలు ఇంతమంది ఉన్నారా అనిపించేలా ఆ కామెంట్ సెక్షన్ ఉందని, అంతకంటే దారుణం ఏమిటంటే కొందరు స్త్రీలు కూడా శివాజీ మాటలను సమర్థిస్తూ ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని రేఖా భోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ ఆలోచనల్లోనే ఒక పెద్ద కురూపి అని అభివర్ణించిన ఆమె, ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఇక సెలవు (RIP narrow minded ppl) అంటూ తన పోస్ట్‌ను ముగించారు. శివాజీ వ్యవహారశైలిపై ఆమె చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: