హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: స్పీకర్లు బద్దలయ్యేలా తమన్ మ్యూజిక్.. ఈ ఏడాది మొత్తం ఆయన హవానే.!

Pandrala Sravanthi
2025 సంవత్సరం ముగియడానికి సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ నేపధ్యంలోనే చాలామంది 2025 లో ఏమేం చేసాం ఏమేం జరిగాయి అనేది మరొకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటారు. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 2025 లో ఎన్నో అద్భుతాలు జరిగిపోయాయి. కొంతమంది సినీ సెలబ్రిటీలకు ఈ సంవత్సరం సంతోషాన్ని నింపితే మరి కొంత మందికి నిరాశను నింపింది. అయితే ఈ ఏడాది అత్యంత సక్సెస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్.ఎస్.తమన్ కూడా ఒకరు. అయితే అలాంటి తమన్ ఈ ఏడాది ఏ సినిమాలకు వర్క్ చేశారు..అందులో ఏ సినిమాలు హిట్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు. అలాంటి తమన్ ఈ ఏడాది డాకు మహారాజ్, ఓజి, అఖండ-2, గేమ్ ఛేంజర్,తెలుసు కదా వంటి తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. 


ఇందులో గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలోని సంగీతానికి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అలాగే డాకు మహారాజ్,అఖండ-2 సినిమాలకు ఇచ్చిన మ్యూజిక్ కి థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోయాయి. థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి చాలా చోట్ల థియేటర్లలో స్క్రీన్లు తగలబడిపోయాయి. అలా తమన్ బాలకృష్ణకి మంచి మ్యూజిక్ అందించడంతో చాలామంది ఈయన్ని నందమూరి తమన్ అని పిలుచుకుంటున్నారు. అంతే కాదు నందమూరి కుటుంబ సభ్యులు కూడా తమన్ ని నందమూరి తమన్ గా పిలుచుకోవడం గమనార్హం. అలాగే సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి ఈ రెండు సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తమన్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల సినిమాలకు కూడా మ్యూజిక్ అందించారు.


అలా బాలీవుడ్లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ వహించిన జాట్ మూవీకి కూడా తమన్ తన అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడమే కాకుండా మ్యూజిక్ పరంగా కూడా మంచి హిట్ అయింది. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీప్రసాద్ ఉండేవారు.కానీ ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.ఇక ఈ ఏడాది సక్సెస్ఫుల్గా ముగించుకొని వచ్చే ఏడాది కూడా మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అలా మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ కి మ్యూజిక్ అందించారు. అలాగే అఖిల్ లెనిన్ మూవీ తో పాటు వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: