వామ్మో: ఓటిటి రైట్స్ లో కూడా రికార్డు సృష్టించిన ధురంధర్..!

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన రణవీర్ సింగ్ తాజాగా నటించిన చిత్రం ధురంధర్. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్లో ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. బాలీవుడ్ లో మాత్రమే విడుదలైన ఈ సినిమా దేశమంతట చర్చించుకునేలా చేసింది. దీంతో ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు.

ధురంధర్ చిత్రం ఇప్పటికే రూ .700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వినిపిస్తున్నాయి. ధురంధర్  సినిమా ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్ ఏకంగా రూ.280 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు బాలీవుడ్ లోనే అత్యధికంగా ఓటీటి రైట్స్ అమ్ముడు పైన చిత్రంగా నిలిచింది.



ఈ విషయం బాలీవుడ్ సినీ పరిశ్రమనే ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంతో పాటు rrr వంటి చిత్రాలకు కూడా ఓటిటి రైట్స్ అదే రేంజ్ లో జరిగింది. కానీ ఇప్పుడు ధురంధర్ చిత్రానికి మొదటిసారి ఇంత ధర పలకడంతో ఈ విషయం వైరల్ గా మారింది. జనవరి 30 వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని ఓటీటిలో స్ట్రిమింగ్ తీసుకోవచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధురంధర్ చిత్రానికి పార్ట్ 2  కూడా ఉంటుందంటూ చిత్రబృందం అనౌన్స్మెంట్ చేయగా ,2026 మార్చి లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధురంధర్ మూవీ తెలుగులో  ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: