"శివాజీ ఆడవాళ్ల సామాన్లు కామెంట్"..విశ్వక్ సేన్ షాకింగ్ ఆన్సర్..మళ్లీ పెంట చేశాడుగా..!?

Thota Jaya Madhuri
‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు ఎలా దుస్తులు ధరించాలి అనే అంశంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. మహిళలు పద్ధతిగా బట్టలు ధరించాలని సూచిస్తూ ఆయన కొన్ని నీచమైన, అనుచితమైన పదాలను ఉపయోగించడం అనేక వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది.ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో శివాజీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను చెడు ఉద్దేశంతో మాట్లాడలేదని, మంచి చెప్పాలనే భావనతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన వివరణలు ఇచ్చినప్పటికీ, చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా తప్పేనని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వారి ఎంపికలపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.



ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విమర్శలు కేవలం ప్రేక్షకుల నుంచే కాకుండా, సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల నుంచే ఎక్కువగా రావడం. అనసూయ భరద్వాజ్, మంచు లక్ష్మి, యాంకర్ సుమ వంటి పలువురు ప్రముఖ మహిళా సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఏమి ధరించాలి, ఎలా ఉండాలి అని ఎవ్వరూ నిర్ణయించాల్సిన అవసరం లేదని, ప్రతి మహిళకు తన అభిరుచులు, తన స్వేచ్ఛ ఉంటాయని వారు స్పష్టంగా చెప్పారు. సమాజంలో మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుకబడిన ఆలోచనలకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.



ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే తాజాగా హీరో విశ్వక్ సేన్ కూడా ఈ అంశంపై స్పందించారు. మహిళలకు మద్దతుగా నిలుస్తూ శివాజీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిప్రాయాలు వ్యక్తపరచడం ప్రతి ఒక్కరి హక్కేనని, కానీ కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉండటమే మంచిదని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. అర్థం లేని, అవసరం లేని విషయాలను విస్తృతంగా ప్రచారం చేయడం మానేయాలని ఆయన హితవు పలికారు. మహిళలు ఏం ధరించాలి, ఎలా జీవించాలి అనే విషయాల్లో ఎవరికీ సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని విశ్వక్ సేన్ తేల్చిచెప్పారు. ప్రతి మహిళకు తన శరీరంపై, తన జీవితంపై పూర్తి హక్కు ఉంటుందని, అలాంటి హక్కులను ప్రశ్నించే వ్యక్తులు సమాజానికి మంచి సందేశం ఇవ్వలేరని ఆయన అన్నారు. అంతేకాదు, ఈ రకమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులు నిజమైన పురుషులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతినిధ్యం వహించరని కూడా ఆయన కఠినంగా వ్యాఖ్యానించారు.



మొత్తంగా చూస్తే, ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పెద్ద సామాజిక చర్చగా మారింది. మహిళల గౌరవం, స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికలపై సమాజం ఎంత సున్నితంగా ఆలోచించాలి అనే అంశాన్ని మరోసారి ఈ ఘటన తెరపైకి తెచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు మాట్లాడే మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని, కాబట్టి వారు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.శివాజీ అంటే ఒకప్పుడు మమచి స్టార్ ఆ తరువాత పొలిటికల్ పరంగా తల దూర్చి ట్రోల్ అయ్యాడు ఉన్న పేరు పాడు చేసుకున్నాడు. ఇప్పుడిప్పుడే మంచిగా సెటిల్ అవుతున్న మూమెంట్ లో మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి పెంట పెంట చేసుకుంటున్నారు అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు జనాలు..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: