నానికి జోడీగా కత్తిలాంటి ఫిగర్.. ఈ డైరెక్టర్ కి గుడి కట్టినా తప్పులేదు బ్రో..?
ఈ క్రమంలోనే నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో నాని పూర్తిగా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. ప్రతి అప్డేట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై మూవీ మేకర్స్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ఇటీవల ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా కయాదు లోహర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీలను జత చేయడం గమనార్హం. దీంతో ఆమె ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోందనే ప్రచారం మరింత బలపడింది. ఈ విధంగా కావాలనే హింట్ ఇచ్చిందా? లేక అభిమానుల ఊహలేనా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.నాని పక్కన కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు నిజమైతే, అది పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. “నానికి కత్తిలాంటి ఫిగర్ ఉన్న హీరోయిన్ సెట్ చేశాడు”, “ఈ డైరెక్టర్‌కు గుడి కట్టినా తప్పులేదు” అంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాని ఇమేజ్‌కు, కథ డిమాండ్‌కు తగ్గ హీరోయిన్ ఎంపిక చేశారని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మరోసారి ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.