హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: యూట్యూబ్ ని షేక్ చేసిన సాంగ్స్..
ఈ ఏడాది రజనీకాంత్ నటించిన కూలి సినిమాలోని మోనిక పాట 314 మిలియన్ తో ఈ ఏడాది అత్యధికంగా వ్యూస్ రాబట్టింది. తమిళంలో యేడి సాంగ్ సైతం బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరో సూర్య నటించిన రెట్రో చిత్రంలోని కనియా సాంగ్ బాగా ఆకట్టుకుంది. తెలుగు విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని గోదారి గట్టు పాట ఒక సెన్సేషనల్ అయ్యింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రంలోని జరగండి జరగండి పాట యూత్ ని బాగా ఆకట్టుకుంది. బాలకృష్ణ నటించిన డాకుమహారాజ్ చిత్రంలోని దబిడి దిబిడే సాంగ్, నా బంగారు కూన అనే పాటలు బాగా ఆకట్టుకున్నాయి.
సాయి పల్లవి, నాగచైతన్య నటించిన తండేల్ చిత్రంలోని బుజ్జి తల్లి పాట, పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాలోని టైటిల్ సాంగ్ ఆకట్టుకున్నాయి. అలాగే ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంలోని నువ్వుంటే చాలే, చిన్ని గుండెలో పాటలు, కోర్టు చిత్రంలోని కథలెన్నో చెప్పారు సాంగ్, మిరాయి చిత్రంలోని వైబ్ ఉంది బేబీ, రాబిన్ హుడ్ చిత్రంలోని అదిదా సర్ప్రైజ్, జూనియర్ చిత్రంలో వైరల్ వయ్యారి పాటలు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి.