అనసూయ-శివాజీ లకి అప్పటి నుంచే గొడవలు ఉన్నాయా..? హీట్ పెంచుతున్న హాట్ న్యూస్..!
శివాజీ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను ప్రస్తావించిన అనసూయ, “ఈ రోజు ఆయన ప్రెస్‌మీట్‌లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఇది ఒక నార్సిస్ట్‌కు ఉండే లక్షణం. చేతగానితనం వల్లే ఇలాంటి మాటలు వస్తాయి” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే ఫెమినిజం గురించి కూడా స్పష్టంగా మాట్లాడారు. “ఫేక్ ఫెమినిజం ఎక్కడా లేదు సార్. మగాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే నిజమైన ఫెమినిజం” అని ఆమె తేల్చిచెప్పారు.అనసూయ మాట్లాడుతూ, “సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్లు, ఇన్‌సెక్యూరిటీ వల్లే ఇలాంటి మాటలు మాట్లాడతారు. అందుకే పాపం సింపతీ కార్డ్ వాడేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తనను ఎందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. “నేనెందుకు అందులోకి లాగాను? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా?” అంటూ నిలదీశారు.
తాను కూడా ఒక హీరోయిన్‌నే అని గుర్తుచేసిన అనసూయ, “నేను కూడా హీరోయిన్‌ని సార్. మిమ్మల్ని ఇలానే బట్టలు వేసుకోవాలని మీకు ఎవరైనా చెబుతున్నారా? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలని చెప్పేంత చిన్న పిల్లలం కాదు” అని ఘాటుగా స్పందించారు. “మరణశిక్ష వేయండి అని అంటారు… అలాంటివి వద్దు సార్” అంటూ అసహనం వ్యక్తం చేశారు.ఆడవాళ్లపై గౌరవం గురించి కూడా అనసూయ తీవ్రంగా మాట్లాడారు. “నిజంగానే మీకు ఆడవాళ్లపై గౌరవం ఉంటే… ఏంట్రా అడవి జంతువుల్లా మీద పడటం? ఆ అమ్మాయి అంత అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేయడం ఎందుకు? ఆమెలో అందం చూసి గౌరవించలేని మగవాళ్లకే చెప్పండి” అంటూ తీవ్రంగా విమర్శించారు.
శివాజీ చేసిన మరో వ్యాఖ్యపై స్పందిస్తూ అనసూయ, “మీరు అన్నట్లు నేను జాలి పడలేదు. నా రుణం తీర్చుకునే అవకాశం దొరకాలని అన్నారు. నాకు మీ సపోర్ట్ అవసరం లేదు” అని స్పష్టం చేశారు. “నా భర్త నాకు పూర్తి సపోర్ట్‌గా ఉన్నారు. ఎంతోమంది నా తోటి సహచరులు నాకు అండగా ఉన్నారు. మీలాంటి వాళ్ల మద్దతు నాకు అస్సలు అవసరం లేదు సార్” అంటూ తేల్చిచెప్పారు.అంతేకాదు, “మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది” అంటూ శివాజీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి సోషల్ మీడియాలో ఏవైనా అసభ్య వ్యాఖ్యలు చేసినా, వల్గర్ కామెంట్స్ చేసినా లీగల్ నోటీసులు వస్తాయని ఆమె హెచ్చరించారు.
ఇక వీరిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని గమనించిన నెటిజన్లు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇది కేవలం ఒక అభిప్రాయ భేదం కాదు, వీరిద్దరి మధ్య ఏదో వ్యక్తిగత గొడవ ఉన్నట్లుగా కనిపిస్తోందని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.