టికెట్ల రేటుపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్..!

Divya
గత కొన్నేళ్లుగా సినిమా టికెట్ల ధరలతో పోలిస్తే థియేటర్లో పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధరలే ఎక్కువగా ఉన్నాయని, అటు సామాన్య ప్రజలతోపాటు చాలామంది సెలబ్రిటీలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా తమ అభిప్రాయంగా తెలియజేశారు. ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచడంతో ఇప్పుడు మరొకసారి ఈ విషయం వినిపిస్తోంది. ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలి అంటే టికెట్ రేట్లతో పాటుగా ఖర్చులు అన్నీ కలిపి కనీసం ఒక్కో వ్యక్తికి 500 రూపాయలు పైనే ఖర్చవుతుంది. ఇక ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా రూ.2,000 వరకు ఖర్చు అవుతుందని ఈ పరిస్థితులలో థియేటర్లకు వెళ్లడం కూడా కష్టమవుతుందని వాపోతున్నారు.



థియేటర్లలో వాస్తవంగా ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం (గురువారం) సినిమా టికెట్ల రేటు, షూటింగ్ ప్రోత్సాహాలకు సంబంధించిన విషయాల పైన సమావేశం నిర్వహించగా అందులో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో జరిగినటువంటి సమావేశంలో డైరెక్టర్ తేజతో పాటు చాలామంది సినీ రంగానికి చెందిన వారు హాజరయ్యారు. ఆంధ్రాలో సినిమా షూటింగులకు ఇస్తున్న రాయితీలు అలాగే ఇప్పటివరకు ఉన్న జీవోలు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల పైన ఏపీ ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాలలో టికెట్ల రేట్ల విషయంపై కోర్టు తీర్పులు, అనుసరిస్తున్న విధానం పైన కూడా చర్చించారు.


ఈ సమావేశం అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రతి చిత్రానికి కూడా ధరలు పెంచడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందుకే టికెట్ల రేటుకి సంబంధించి అన్ని జీవోలు ఒకేలా ఉండాలని , ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని , అలాగే డిస్టిబ్యూటర్లు, నిర్మాతలతో కలిసి విడివిడిగా సమావేశాలను నిర్ణయించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మీడియాతో సినీ దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ప్రస్తుతం థియేటర్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని టికెట్ల రేటుతో పోలిస్తే పాప్ కార్న్ ఇతర ఆహార పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉండడం చేత థియేటర్లకు కుటుంబంతో కలిసి ప్రజలు రాలేకపోతున్నారని తెలియజేశారు. అలాగే ఓటిటి వేదికలు, పైరసీ వల్ల కూడా గణనీయంగా నష్టం జరుగుతోందని తెలిపారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తన అభిప్రాయంగా తెలిపారు డైరెక్టర్ తేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: