శివాజీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..నిధి అగర్వాల్ పోలీస్ కేసు..!?

Thota Jaya Madhuri
ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ పేరు ఎంతగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా హీరోయిన్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చీప్‌గా, అవమానకరంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈవెంట్‌లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకొని వస్తే ఎలా అని ప్రశ్నించిన శివాజీ, పద్ధతిగా చీర కట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. అంతేకాదు, చీర కట్టుకుంటే దేవతలలా భావిస్తారని, అదే మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే పైకి నవ్వినా లోపల మాత్రం చెడ్డగా ఆలోచిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.



ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కొంతమంది హీరోయిన్లు కూడా బహిరంగంగా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. “నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాడా?” అనే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఈ విధంగా మాట్లాడటం అసహ్యకరమని, ఇది పూర్తిగా తప్పని వారు స్పష్టం చేశారు.ఈ వివాదం నేపథ్యంలో తాజాగా శివాజీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హీరోయిన్ నిధి అగర్వాల్, సమంత వంటి నటీమణులు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. స్టేజ్‌పై డ్రెస్ జారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళనతోనే తన మాటలు వచ్చాయని అన్నారు. తన ఉద్దేశం మహిళలను అవమానించడం కాదని, భద్రత గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు.



అయితే శివాజీ వివరణపై కూడా తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ మేరకు ఓ ఒక పోస్ట్ చేశారు. “బాధితురాలినే తప్పుపట్టడం సరైంది కాదు” అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం ద్వారా సమస్యను మహిళలపైనే నెట్టివేయడం అన్యాయమని ఆమె స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ శివాజీ వ్యాఖ్యలపై పోలీస్ కేసు పెట్టాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి మాటలు ఇంకొకసారి ఎవరు మాట్లాడకుండా ఉండాలంటే చట్టపరమైన చర్యలు అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మహిళల పట్ల గౌరవం ఏంటో తెలియజేయాలంటే పోలీస్ కేసు తప్పనిసరి అంటూ నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.



ఇదిలా ఉండగా, శివాజీ మాత్రం తన వ్యాఖ్యల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. “దరిద్రపు ముం*,సామాన్లు ” వంటి పదాలు వాడటం తప్పేనని ఒప్పుకున్నా, మహిళల డ్రెస్సింగ్‌పై తాను మాట్లాడిన విధానం మాత్రం పూర్తిగా పాజిటివ్‌గానే ఉందని సమర్థించుకుంటున్నారు. తన మాటలను వక్రీకరించి చూపుతున్నారని, అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన అంటున్నారు.మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హీట్ పెంచుతోంది. ఒకవైపు మహిళా హక్కులు, గౌరవం గురించి చర్చ జరుగుతుంటే, మరోవైపు సెలబ్రిటీల బాధ్యతాయుతమైన మాటలు ఎంత ముఖ్యమో అనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: