బ‌న్నీకి పెద్ద టెన్ష‌న్ త‌ప్పించేసిన బోయ‌పాటి... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ రావడంతో, మరోసారి ఈ కాంబో సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం బన్నీ తన తదుపరి సినిమాల లిస్ట్ నుంచి బోయపాటి పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత అల్లు అర్జున్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.


గతంలో అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి-బన్నీ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు దాదాపు జీరో అని తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తన క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత ఆయన లైన్ లో ఉన్న దర్శకులు కొంద‌రు ఉన్నారు. బ‌న్నీ - అట్లీ  కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది.


లోకేష్ కనగరాజ్ మాస్ మరియు స్టైలిష్ యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్. లోకేష్ తో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఒక క్రేజీ డైరెక్టర్ కూడా బన్నీకి కథ వినిపించినట్లు తెలుస్తోంది. బన్నీ లిస్ట్ నుంచి తప్పుకోవడంతో, బోయపాటి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'సరైనోడు' తర్వాత రిపీట్ కావాల్సిన ఈ క్రేజీ కాంబినేషన్ ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ గ్రాఫ్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: