రీ రిలీజ్ లో భాగంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవి అనేది తెలుసుకుందాం.
బాహుబలి ది ఎపిక్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ సినిమాలను కలిపి బాహుబలి పేరుతో పెద్ద ఎత్తున చేశారు. ఇక రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 51.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందిన గిల్లి సినిమాను కొంత కాలం క్రితం పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 32.50 కోట్ల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సౌందర్య , రమ్యకృష్ణ హీరోయిన్లుగా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన పడియప్ప మూవీ ని తాజాగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 18.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
తలపతి విజయ్ హీరోగా రూపొందిన సచిన్ మూవీ ని కూడా కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా 13.60 కోట్ల కలక్షన్లను వసూలు చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఖలేజా సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేయగా ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా 10.78 కోట్ల కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది.
మహేష్ బాబు హీరో గా రూపొందిన మురారి సినిమా రీ రిలీజ్ లో భాగంగా 8.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీకి 8.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి మూవీకి 7.46 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య 2 మూవీ కి 6.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి.