ఆఫర్ కోసం కమిట్మెంట్ కండిషన్స్..సీరియల్ హీరోయిన్ కన్నీళ్లు..!
గతంలో ఒక ఇంటర్వ్యూలో నైనీషా మాట్లాడుతూ.. తన కెరియర్ ప్రారంభంలో తనకు తినడానికి తిండి కూడా లేదని ఒకానొక సమయంలో ఆకలి తీర్చుకోవడానికి తన రక్తాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అలా ఎన్నో కష్టాలను నెట్టుకొస్తూ ఉన్న సమయంలోనే ఆఫర్స్ వచ్చాయని కానీ ఆఫర్స్ ఇస్తే తమకు ఏమి ఇస్తావ్ అంటూ చాలామంది అడిగే వారిని, కమిట్మెంట్ కండిషన్స్ కూడా పెట్టే వారిని తెలియజేసింది నైనీషా. కొన్నిసార్లు చాలా బలవంతం కూడా పెట్టారని అయినా కూడా అక్కడి నుంచి ఎలాగోలాగా బయటకి వచ్చేసానని తెలియజేసింది.
ఒకానొక సమయంలో అలాంటి విషయాల వల్ల చచ్చిపోదాం అనుకున్నానని ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తాను సద్వినియోగం చేసుకొని మరిన్ని ఆఫర్స్ వచ్చేలా చేసుకున్నాను అంటూ తెలియజేసింది. అలా బ్రహ్మముడి సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నైనిషా. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి రావడంతో ఇప్పటికి తన తల్లిదండ్రులు మాట్లాడరని, ఆ సమయంలోనే తనకు మామయ్య ఏ కష్టం వచ్చిన నేను ఉన్నాను చెప్పు అని అడ్డగా నిలిచారని. ఇప్పటికీ ఆయన తనకు సపోర్టివ్ గా ఉన్నారని తెలియజేసింది నైనీషా. ఆ ధైర్యంతోనే ఇండస్ట్రీలో తాను రాణిస్తున్నానని తెలియజేసింది. ప్రస్తుతం నైనిషా చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.