జైలర్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే ఫ్యూజుల్ అవుట్

Divya
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన టేకింగ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సృష్టించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలకమైన పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా రాబోతున్న జైలర్ 2 సినిమాని కూడా అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తోంది.


అయితే ఈ సీక్వెల్లో బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన షారుక్ ఖాన్ ఒక పవర్ ఫుల్ క్యామియో పాత్ర చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఒక సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ట్రెండీగా మారుతున్నాయి. జైలర్ 2 చిత్రంలో షారుక్ ఖాన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి చర్చలు ముగిశాయని కూడా ఒక హింట్ ఇచ్చారు. ఈ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి అటు రజనీకాంత్ అభిమానులు షారుక్ ఖాన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ విషయాన్ని బయట పెట్టింది ఎవరో కాదు బాలీవుడ్ నటుడు మిధున చక్రవర్తి. ఆయన కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు.


అలాగే కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా ఇందులో మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖ నటులు కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రజినీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చుట్టే సినిమా కథ ఉంటుంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా స్క్రిప్టుకు సంబంధించి పనులను పూర్తి చేశారని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు. మరి జైలర్ 2 చిత్రంతో ఎలాంటి రికార్డులు తిరగ రాస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: