గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్..అవాక్కవుతున్న ఫ్యాన్స్..!
ఈమధ్య అక్క, అమ్మ పాత్రలలో అద్భుతంగా నటిస్తోంది రాధికా శరత్ కుమార్. ఇప్పుడు తాజాగా తన కొత్త ప్రాజెక్టులో భాగంగా 75 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనుంది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో చూసిన అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాషన్ స్టూడియో సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం తామ్ కిళవి. ఈ చిత్రానికి డైరెక్టర్ గా శివకుమార్ మురుగేషన్ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలోని రాధిక ప్రధాన పాత్రలో నటిస్తోంది.
తాజాగా రాధిక పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే రాధిక ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించింది.ఇప్పుడు మరొకసారి ఒక వినూత్న ప్రయత్నం చేస్తోంది. రాధిక ఉసిలంపట్టి గ్రామంలో ఉండేటువంటి కట్టుబాట్లలో నివసించే 75 ఏళ్ల భామగా కనిపించబోతోంది. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం గురించి ,అక్కడి సమస్యలు కట్టుబాట్లను తదితర అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రాధిక శరత్ కుమార్ కు మంచి పేరు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.