భర్త నాగ చైతన్యకు బిగ్ షాక్ ఇచ్చిన శోభిత.. అక్కినేని ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అయ్యే మ్యాటర్ ఇది..!
ప్రభాస్ నటనలో సహజత్వం, గంభీరత, సరళత అన్నీ సమానంగా కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లో ఎంతో లోతుగా నటించగలగడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రభాస్ చేసిన చాలా సినిమాలు నాకు ఎంతో నచ్చుతాయి.‘బాహుబలి’ వంటి సినిమాలతో ప్రభాస్ భారతదేశం గర్వపడే స్థాయికి ఎదగడం అభిమానిగా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ వినయం, సరళతతో ఉండటం ప్రభాస్‌ను మరింత గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది. ఆయన సినిమాల కోసం ఎంతకాలమైనా ఎదురుచూడగలిగే అభిమాని మనసు నాకు ఉంది.నటన, ఓర్పు, అంకితభావం అన్నింటికీ ప్రభాస్ నిలువెత్తు ఉదాహరణ. ఆయన నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని, ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని శోభిత వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు, “భర్త నాగచైతన్యను కాకుండా ప్రభాస్ పేరును చెప్పడం షాకింగ్” అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇది అక్కినేని హీరోలకు అవమానకరమని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే మరికొందరు మాత్రం, “వ్యక్తిగత అభిరుచులు వ్యక్తిగతమే. ఎవరికీ నచ్చిన హీరో వారికి ఉండొచ్చు. ఇందులో తప్పేమీ లేదు” అంటూ శోభితకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.