అంత బాగానే ఉన్నా భర్త మహాశయులకు విజ్ఞప్తి గురించి ఆ టెన్షన్ పడుతున్న రవితేజ ఫాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోగా నటించాడు. డింపుల్ హయతి , ఆశిక రంగనాధ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా వరుస అపజయాలతో కెరియర్ను నెట్టుకొస్తున్న రవితేజ కు ఈ సినిమాతో మంచి విజయం తగ్గుతుంది అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.


కానీ ఓ విషయంలో మాత్రం ఆ రవితేజ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ "కిలాడి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్గా నటించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో కూడా డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో కిలాడి సినిమాల ఈ సినిమా రిసల్ట్ కూడా ఉంటుందేమో అని కొంత మంది రవితేజ అభిమానులు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరి కొంత మంది రవితేజ అభిమానులు మాత్రం ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. సంక్రాంతి కి ఇలాంటి జోనర్ సినిమా వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ సినిమాతో రవితేజ మంచి విజయాన్ని అందుకుంటాడు అని కొంత మంది గట్టి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: