2025 ప్రోగ్రెస్ రిపోర్ట్: ఈ సంవత్సరంలో టాప్ తెలుగు హీరో ఎవరో తెలుసా?
ముఖ్యంగా ఆయన నటించిన ‘పుష్ప-2: ది రూల్’ సినిమా సాధించిన సుమారు రూ.1800 కోట్లకు పైగా భారీ వసూళ్లు సినీ పరిశ్రమలోనే కాదు, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లలో కూడా సంచలనం సృష్టించాయి. సినిమా విడుదలకు ముందు నుంచే, విడుదల అనంతరం వరకు కొనసాగిన హడావుడి, రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు, పుష్ప రాజ్ పాత్రపై అభిమానుల అభిమానం—అన్ని కలిసి అల్లు అర్జున్ను ఏడాది పొడవునా వార్తల్లో నిలిపాయి.
అంతేకాదు, అల్లు అర్జున్ భవిష్యత్ ప్రాజెక్టులపై నెలకొన్న అంచనాలు కూడా ఆయన పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ అయ్యేందుకు ప్రధాన కారణంగా మారాయి. ప్రముఖ దర్శకుడు అట్లీతో తెరకెక్కబోయే ప్రాజెక్ట్‌పై ఉన్న హైప్, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్న కొత్త సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానులను ఉత్కంఠలో ఉంచింది. ఈ కారణాల వల్లే 2025లో డిజిటల్ ట్రెండ్స్‌లో అల్లు అర్జున్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.ఈ జాబితాలో రెండో స్థానాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ కైవసం చేసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్న ప్రభాస్, ఈ ఏడాది కూడా గూగుల్ సెర్చ్‌లలో బలమైన ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా ‘కల్కి 2898 పార్ట్ 2’ (కల్కి 2) మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రభాస్‌ను నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాలపై దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తి, ప్రభాస్‌ను డిజిటల్ ప్రపంచంలోనూ టాప్ హీరోలలో ఒకడిగా నిలబెట్టింది.