మన శంకర వర ప్రసాద్ గారు ... అంతా రాంగ్ ట్రాక్‌లో వెళుతోందా..?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మిగిలిన సినిమాల కంటే వెనుకబడిందా అనే ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది. ఈ సంక్రాంతికి మొత్తం ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజా సాబ్'తో మొదలై, జనవరి 14 వరకు వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి. చిరంజీవి సినిమా జనవరి 12న విడుదల అవుతోంది.
రాజా సాబ్:
ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ మరియు రెండు పాటలతో ప్రమోషన్లు మొదలు పెట్టారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్లు ఇంకా స్పీడ్ చేయాల్సి ఉన్నా.. చిరు సినిమా కంటే ఎంతో కొంత ముందే ఉంది.
మన శంకర వరప్రసాద్ గారు:
చిరంజీవి సినిమా నుంచి ఇప్పటికే 'మీసాల పిల్ల', 'శశిరేఖ' అనే రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ పాటలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయి టీజర్ విడుదల కాలేదు. ఎలివేషన్ సీన్స్‌తో కూడిన 'గ్లింప్స్' మాత్రమే వచ్చింది తప్ప, దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ లేదా సినిమా అసలు థీమ్ ఏమిటన్నది టీజర్‌లో చూపించలేదు.
సినిమా విడుదలకు కేవలం 20 రోజులే ఉన్నా.. టీజర్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ 'నారి నారి నడుము మురారి సినిమా లేటుగా ప్రకటించినా, ఇప్పటికే విడుదలైన టీజర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఇప్పటికే టీజర్ మరియు సాంగ్స్‌తో ప్రమోషన్లలో దూసుకు పోతోంది. చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం పాటలతోనే కాకుండా, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే త్వరగా టీజర్ విడుదల కావాల్సి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.