శ్రీదేవి ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన జాన్వీ కపూర్..ఉన్న పేరు చెడకొట్టుకుంటున్నట్లుందే..!
“తల్లి కలను కూతురు నిజం చేస్తోంది”, “ఇదే నిజమైన ట్రిబ్యూట్” అంటూ సోషల్ మీడియాలో జాహ్నవి పై ప్రశంసలు వెల్లువెత్తాయి.
కానీ ఇదంతా సంతోషంగా కొనసాగుతుందనుకున్న సమయంలోనే బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సమాచారం అభిమానులకు షాక్ ఇచ్చింది. అందుతున్న కథనాల ప్రకారం… జాన్వీ కపూర్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమిటంటే, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు జాన్వీకి ఇబ్బందికరంగా అనిపించాయట. ఆ సీన్స్‌ను కొంత మార్చాలని ఆమె డైరెక్టర్‌ను కోరిందని, కానీ డైరెక్టర్ అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌పై అసహనం వ్యక్తం చేసిన జాన్వీ చివరికి ఆ సినిమా నుంచి బయటకు వచ్చిందట.ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఇది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు జాన్వీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.“ఇంత గొప్ప ప్రాజెక్ట్‌ని ఎలా వదులుకుంటావు?”,“ఇది నీ తల్లి డ్రీమ్ ప్రాజెక్ట్ కదా!”,“శ్రీదేవి పరువును తీసేస్తున్నావు”,“ఇప్పటికే ఉన్న పేరును కూడా చెడగొట్టుకుంటున్నావు”అంటూ కొంతమంది నెటిజన్లు జాన్వీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరు అయితే మరింత దారుణంగా బూతులు తిడుతూ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ విషయంలో జాన్వీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా కొందరు అభిమానులు కోరుతున్నా, మరోవైపు శ్రీదేవి ఫ్యాన్స్ మాత్రం తమ ఆవేదనను ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి, జాన్వీ కపూర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో, అలాగే ఈ ప్రాజెక్ట్ నిజంగా శ్రీదేవి డ్రీమ్ ప్రాజెక్టేనా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారికంగా జాహ్నవి కానీ, సినిమా యూనిట్ కానీ స్పందించే వరకు ఇది కేవలం సోషల్ మీడియా చర్చగానే మిగిలే అవకాశముంది.అయితే ఒక విషయం మాత్రం స్పష్టం…ఈ వార్తతో జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.