మరో పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్.. లైఫ్ టర్నింగ్ ఆఫర్ ఇది..!?
ఇప్పటికే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘డ్రాగన్’ లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మైలురాయిగా మారనుంది. అంతేకాదు, ఈ సినిమాతో పాటు ఆమె చేతిలో ఇప్పటికే మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నట్లు సమాచారం.ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కబోయే ఓ భారీ సినిమాలో కూడా హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ఆమె పాన్ ఇండియా స్టార్‌డమ్‌కు ఇది మరో బిగ్ బూస్ట్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో అసలు ఆశ్చర్యం ఏంటంటే, మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిసనన్ ని అనుకుంటూ వచ్చారట. అయితే లాస్ట్ మినిట్‌లో జరిగిన మార్పుల కారణంగా ఆమె స్థానంలో రుక్మిణి వసంత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది . ఈ వార్త నిజమైతే మాత్రం రుక్మిణి వసంత్ అభిమానులకు ఇది నిజంగా వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుసగా భారీ ప్రాజెక్టులు, స్టార్ హీరోల సినిమాలు ఆమె చేతిలో ఉండటంతో అభిమానులు ఇప్పటికే “నెక్స్ట్ ఇయర్ మొత్తం రుక్మిణి వసంత్‌దే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ అవకాశాలను ఆమె ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది, తన నటనతో ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు… ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవల్‌లో రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపిస్తోంది.