ప్రతి వారం కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని వారాలలో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా ఈ వారం చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే ఈ వారం విడుదల అయిన సినిమాలలో అన్ని సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది. ఈ వారం రోషన్ హీరో గా రూపొందిన ఛాంపియన్ , ఆది సాయి కుమార్ హీరో గా రూపొందిన శంబాల , శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన దండోరా , ఈశా సినిమాలు విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాల విడుదలకు ముందు ఈ నాలుగు మూవీ ల నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ నాలుగు మూవీ లపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ నాలుగు సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమాలకు మంచి టాక్ రావడం తో సంక్రాంతి వరకు ఈ మూవీ లకు మంచి కలెక్షన్లు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యం గా ఈ సినిమాలకు ఓ రెండు స్టార్ హీరోల సినిమాల ద్వారా పెద్ద ఎఫెక్ట్ సంక్రాంతి కి ముందే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అది ఏ ఎఫెక్ట్ అనుకుంటున్నారా ..? రీ రిలీజ్ మూవీ ల ఎఫెక్ట్. ఈ సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన మురారి సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు. ఇక వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ను రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ రెండు మూవీ ల రీ రిలీజ్ లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇలా ఈ రెండు మూవీ ల రీ రిలీజ్ లు అతి త్వరలో ఉండడంతో వీటి ద్వారా ఈ వారం విడుదల అయిన ఛాంపియన్ , శంబాల , దండోరా , ఈశా మూవీ ల కలెక్షన్లపై ఎంతో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.