ఆయన ఓ ప్రముఖ నిర్మాత..కానీ చిరంజీవితో సినిమా చేసి చివరికి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు.. ఎందుకు చిరంజీవితో సినిమా చేసి చచ్చిపోవాలనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేది అంటే ఆయనతో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అని అనుకునేవారు నిర్మాతలు. అంతేకాదు చిరంజీవి అప్పట్లో నిర్మాతలకు బంగారు బాతు.. ఆయనతో సినిమాలు చేసిన చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో సెట్ అయ్యారు. కానీ ఓ నిర్మాత మాత్రం చిరంజీవితో ఓ మూవీ చేసి నష్టాల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నారు.మరి ఆ నిర్మాత ఎవరంటే దేవి వరప్రసాద్.. నిర్మాత దేవి వరప్రసాద్ చిరంజీవి హీరోగా చేసిన కొండవీటి రాజా, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా వంటి హిట్ సినిమాలు నిర్మించారు. అదే సమయంలో చిరంజీవికి తన బ్యానర్లో చివరిగా ఒక సినిమాని మర్చిపోలేని సినిమాగా అందించాలని అనుకున్నారు.కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. చివరికి నిర్మాత దేవి వరప్రసాద్ చనిపోవాలనుకున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించిన మృగరాజు సినిమా అందరూ చూసే ఉంటారు. గుణశేఖర్ డైరెక్షన్లో చిరంజీవి చూడాలని ఉంది అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో మృగరాజు సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ చివరికి సినిమా విడుదలయ్యాక అట్టర్ ప్లాఫ్ అయింది. సినిమా విడుదలయ్యాక మొదటి మూడు వారాలు బాగానే క్లిక్ అయినప్పటికీ ఆ తర్వాత వసూళ్లు అక్కడితో ఆగిపోయాయి. చివరికి పెట్టిన బడ్జెట్ తిరిగి రాకపోవడంతో నిర్మాత చచ్చిపోవాలనుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిర్మాత దేవి వరప్రసాద్ ఇంటర్వ్యూలో చెబుతూ.. సినిమా బడ్జెట్ మార్కెట్ పరిధిని దాటిపోయింది. అయినా కానీ చిరంజీవిపై నమ్మకంతో సినిమాకి బడ్జెట్ పెట్టాను.కానీ సినిమా విడుదలయ్యాక మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ వచ్చింది.దాంతో ఆ టాక్ చూసి చనిపోవాలనుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
అయితే ఈ సినిమా రిజల్ట్ గురించి డైరెక్టర్ గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం నిర్మాత దేవి వరప్రసాదే. ఎంత చెప్పినా వినకుండా ఆయన చేసిన పనుల వల్లే సినిమా ఫ్లాప్ అయింది. మొదట ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ నిర్మాత ఒత్తిడి చేసి సంక్రాంతికి విడుదల అని చెప్పారు. ఆ సమయంలో హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగడంతో సినిమా కోసం సరైన టైమ్ ఇవ్వకపోవడంతో సినిమా షేప్ మొత్తం మారిపోయింది.. ఇక మరో విషయం ఏమిటంటే.. సినిమాకి అవసరం లేకపోయినా కూడా నిర్మాత ఓ పాట కోసం భారీ సెట్ వేశారు. వద్దన్నా వినలేదు. ఆ సాంగ్ కి పెట్టిన బడ్జెట్ కారణంగా సినిమా బడ్జెట్ మరింత పెరిగింది.. కానీ ఫలితంగా సినిమా డిజాస్టర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్.