సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్ దళపతి..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్. వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా ,మమిత బైజు కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ (డిసెంబర్ 27) మలేషియాలో చాలా గ్రాండ్ గా జరిగింది. విజయ్ దళపతి లాస్ట్ సినిమా కావడంతో ఈవెంట్ ని కూడా ఫెస్టివల్ రేంజ్ లో మేకర్స్ పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవల్లో చేశారు. వేలాదిమంది అభిమానులు , సినీ సెలబ్రిటీల మధ్య ఈ ఆడియో లాంచ్ అద్భుతంగా జరిగింది.


అయితే ఈ వేదిక పైన అభిమానుల కోసం విజయ్ కచేరి సాంగుకు కూడా డాన్స్ చేసి అలరించారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే చివరి సినిమా. ఈ సినిమా తర్వాత పూర్తిగా సినిమాలను వదిలేసి పొలిటికల్ లీడర్ గా మారబోతున్నారు విజయ్. Tvk పార్టీ పేరుతో పలు రకాల సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2026 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో  అన్ని అసెంబ్లీ నియోజకవర్గం  పోటీ చేయబోతున్నారు. దీంతో అక్కడ రాజకీయంగా కూడా పలు ప్రకంపనలు సృష్టిస్తున్నారు విజయ్.



ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఈ నేపథ్యంలోనే సినిమాలకు కూడా స్వస్తి చెప్పినట్లుగా వినిపిస్తున్నాయి. కొన్నేళ్లపాటు అగ్ర హీరోగా పేరు సంపాదించిన విజయ్ సినిమాల నుంచి తప్పుకోవడంతో అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. దీంతో  అభిమానులు సైతం కోలీవుడ్ సినీ చరిత్రలో స్టార్ హీరో శకం ముగిసింది.. అంటు కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 9వ తేదీన జననాయగన్ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా తో విజయ్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తారా చూడాలి మరి. పొలిటికల్ పరంగా విజయాన్ని సాధించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: