సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కెరియర్ ప్రారంభం లో మంచి విజయాలు వచ్చిన ఆ తర్వాత మాత్రం దశాబ్దాల కొద్దీ భారీ అపజయాలు వస్తూ ఉంటాయి. అలాంటి హీరోలు కూడా కొన్ని సందర్భాలలో మంచి విజయాన్ని అందుకొని కం బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఇక అలాంటి సంఘటన ఒకటి తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో జరిగింది. ఓ నటుడు కెరియర్ ప్రారంభంలో నటించిన రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన అనేక సంవత్సరాలు పాటు భారీ స్థాయి ఆపజయాలను అందుకుంటూ వచ్చాడు. తాజాగా ఈయన నటించిన ఓ సినిమా విడుదల అయింది. దానికి మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.
దానితో ఆయన కెరియర్ యూటర్న్ తీసుకుంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మారెవరో కాదు ఆది సాయి కుమార్. ఈ నటుడు ప్రేమ కావాలి అనే సినిమాతో కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈయన నటించిన లవ్ లీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా కెరియర్ ప్రారంభంలో రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు అనేక మూవీలతో భారీ అపజయాలను అందుకున్నాడు. తాజాగా ఈయన నటించిన శంభాల అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. సూపర్ సార్ ఇది కలెక్షన్లు ఈ మూవీ కి ప్రస్తుతం దక్కుతున్నాయి. దానితో ఈయన కెరియర్ యూటర్న్ తీసుకుంది అని , ఇప్పటి నుండి ఈయన మంచి సినిమాల్లో నటిస్తే మళ్లీ ఈయన క్రేజ్ భారీగా పెరుగుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.