టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనేక సంవత్సరాలు అవుతుంది. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే ఆయన ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా వెంకటేష్ ఎప్పటికప్పుడు మంచి విజయాలను అందుకుంటూ అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను కొనసాగించాడు. కానీ గత కొన్ని సంవత్సరాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకటేష్ కి సరైన విజయం దక్కలేదు. చాలా సంవత్సరాల క్రితం వెంకటేష్ "దృశ్యం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్న భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. ఎఫ్ 2 సినిమా బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయిన కూడా ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు.
ఇక వెంకటేష్ నటించిన నారప్ప , దృశ్యం 2 సినిమాలకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చిన ఈ రెండు సినిమాలు దియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యాయి. దానితో వెంకటేష్ అభిమానులు మా అభిమాన హీరో ఎప్పుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ కావడంతో వెంకటేష్ అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ వరుస క్రేజీ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.