బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ తాజాగా దురందర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమాకు రెండు భాగాలు ఉండనున్నట్లు , ఈ మూవీ యొక్క రెండవ భాగం ను మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ మూవీ మొదటి భాగం విడుదల అయిన తర్వాత దాదాపు నాలుగు నెలలకే ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక ఇదే ఫార్ములా ను దాదాపుగా ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను ఈ మూవీ బృందం వారు శర వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు , అందులో మొదటి భాగాన్ని 2027 వ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , ఆ తర్వాత కేవలం ఆరు నెలల సమయం లో ఈ సినిమా రెండవ భాగాన్ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.