తెలుగు టాప్ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. హీట్ పెంచుతున్న హాట్ న్యూస్..!

Thota Jaya Madhuri
‘దేవర’ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటి? ఎవరితో సినిమా చేయబోతున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఇదే చర్చ కొనసాగుతోంది. నిజానికి కొరటాల శివ ‘దేవర’కి సీక్వెల్‌గా ‘దేవర 2’ చేయాల్సి ఉంది. అయితే అనేక కారణాల వల్ల ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొరటాల తదుపరి సినిమా దిశ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ‘దేవర’ తర్వాత ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశంతో కొరటాల శివ పలువురు హీరోలను కలిసి కొత్త కథలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. కొన్ని కథలు హీరోలకు నచ్చకపోవడం, మరికొన్ని ప్రాజెక్టులు కమిట్మెంట్స్ కారణంగా ముందుకు సాగకపోవడం వంటివి చోటుచేసుకున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో కొరటాల శివ చాలా కాలంగా కోరుకుంటున్న ఓ డ్రీమ్ కాంబినేషన్ మరోసారి చర్చలోకి వచ్చింది.



ఇటీవల కొరటాల శివ పవన్ కళ్యాణ్ను కలిశారన్న సమాచారం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్‌కు ఓ పూర్తి స్థాయి కథను కొరటాల వినిపించారట. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్నది కొరటాల శివకు ఎప్పటినుంచో ఉన్న కోరిక. ‘భరత్ అనే నేను’ లాంటి సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్న కథ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి బాగా సెట్ అవుతుందన్న అభిప్రాయం అభిమానుల్లోనూ బలంగా ఉంది. ఈ విషయాన్ని కొరటాల శివ కూడా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు.



అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిసి కథ చెప్పాలని కొరటాల శివ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. చివరకు ఆ అవకాశం రావడం, పవన్‌ను కలిసి కథ వినిపించడం జరిగిపోయాయి. అయితే ఇక్కడే అనూహ్యమైన ట్విస్ట్ ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.అయితే పవన్ ఎందుకు ఈ కథను ఓకే చేయలేదన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొరటాల శివ చెప్పిన కథ పవన్‌కు నచ్చలేదా? లేక ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలు, రాజకీయ బాధ్యతలు, ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు టైమ్ ఇవ్వలేకపోతున్నారా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం రాలేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటన్నది కాలమే చెప్పాలి.



మొత్తానికి కొరటాల శివ మాత్రం ఇంకా నిరీక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ప్రాజెక్ట్‌లకు వెంటనే డేట్స్ ఇవ్వగల పరిస్థితిలో ఎవ్వరూ లేరు. మరోవైపు యంగ్ హీరోలతో సినిమా చేసే ఆలోచన కూడా కొరటాల శివకు లేదని సమాచారం. ఆయన కథలు, ఆయన ట్రీట్‌మెంట్ స్టార్ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి, కొత్త లేదా యంగ్ హీరోలతో సినిమా చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం బలంగా ఉంది.ఇక స్టార్ హీరో దొరకాలంటే కొరటాల శివ కొంతకాలం వేచి చూడక తప్పదు. లేదంటే తమిళం లేదా మలయాళం ఇండస్ట్రీలలోని స్టార్ హీరోల వైపు చూడాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న ఆప్షన్లు ఇవే. ఏది జరిగినా, కొరటాల శివ తదుపరి సినిమా ఏ హీరోతో, ఎలాంటి కథతో ఉంటుందన్నది సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: