ఎట్టకేలకు లెనిన్ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత..?
శ్రీ లీల ప్లేస్ లోకి మరో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ తో ఆకట్టుకున్న లెనిన్ మూవీలో అఖిల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా నిర్మాత నాగ వంశీ అక్కినేని అభిమానులకు డబల్ గుడ్ న్యూస్ తెలియజేశారు. అదేమిటంటే ఈ సినిమా చాలా బాగా వస్తోంది వచ్చే ఏడాది మార్చిలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామంటూ తెలిపారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేయబోతున్నామని తెలియజేశారు.
దీంతో అక్కినేని అభిమానుల సైతం తెగ ఆనందపడుతూ నాగ వంశీ చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోనే మరో రెండు బడా ప్రాజెక్టులు కూడా విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంతో పాటుగా రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా అదే నెలలోనే విడుదల కాబోతున్నాయి. మరి ఇప్పుడు అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా కూడా అదే నెలలో విడుదల కాబోతోందని నిర్మాత చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. పెద్ది, ప్యారడైజ్ సినిమాలతో పోటీపడి అఖిల్ విజయం సాధిస్తాడా? లేదా అన్న విషయం చూడాలి మరి.