యూఎస్ మార్కెట్‌లో బాలయ్య అరుదైన ట్రాక్ రికార్డు ..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2: తాండవం’  సినిమా  ప్రస్తుతం థియేటర్ల వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయంతో బాలయ్య నార్త్ అమెరికా మార్కెట్‌లో సరికొత్త చరిత్రను లిఖించారు.


నార్త్ అమెరికాలో వరుసగా 5వ 'మిలియన్' సినిమా
ఒకప్పుడు సీనియర్ హీరోలకు ఓవర్సీస్ మార్కెట్ కొంత బలహీనంగా ఉండేది. కానీ, బాలయ్య ఆ అంచనాలను తలకిందులు చేశారు. ‘అఖండ 1’తో మొదలైన ఆయన జైత్రయాత్ర ఇప్పుడు ‘అఖండ 2’తో పతాక స్థాయికి చేరింది. నార్త్ అమెరికా మార్కెట్‌లో వరుసగా ఐదు సినిమాలతో 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. అఖండ 1 - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి - డాకు మహారాజ్ - అఖండ 2: తాండవం సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడం అనేది టాలీవుడ్‌లో చాలా అరుదైన విషయం.


ఆరు మిలియన్ సినిమాలతో సీనియర్ స్టార్లలో టాప్ :
కేవలం వరుస సినిమాలే కాకుండా, మొత్తం కెరీర్‌లో అత్యధిక మిలియన్ డాలర్ సినిమాలు ఉన్న సీనియర్ హీరోగా బాలయ్య తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతంలో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో కలిపి బాలయ్య ఖాతాలో ఇప్పుడు మొత్తం 6 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నాయి. ఈ ఘనత సాధించిన ఏకైక సీనియర్ స్టార్ హీరోగా ఆయన యూనిక్ ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారు.


నెగిటివిటీని దాటిన తాండవం :
‘అఖండ 2’ విడుదల సమయంలో సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ, బాలయ్య మాస్ పవర్ ముందు అవేవీ నిలవలేదు. బోయపాటి మార్క్ యాక్షన్, థమన్ నేపథ్య సంగీతం, అన్నింటికీ మించి బాలయ్య ‘అఘోరా’ పాత్రలోని ఉగ్రరూపం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. వయసు పెరుగుతున్నా వసూళ్లలో ఏమాత్రం తగ్గని బాలయ్య, తన తదుపరి సినిమాలతో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సీనియర్ హీరోల సత్తా ఏంటో బాలయ్య తన ‘తాండవం’తో నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: