డిసెంబర్ నెలలో నాగార్జునకు ఇన్ని హిట్లు ఉన్నాయా.. ఈ విషయాలు మీకు తెలుసా?
టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన కెరీర్లో ఎన్నో మలుపులు, వైవిధ్యమైన పాత్రలు కనిపిస్తాయి. అయితే నాగార్జున కెరీర్ గ్రాఫ్‌ను గమనించిన వారికి ఒక ఆసక్తికరమైన విషయం స్పష్టంగా అర్థమవుతుంది, అదే డిసెంబర్ నెల సెంటిమెంట్. నాగార్జున నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏడాది చివరి నెలలోనే విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అందుకే నాగార్జునకు డిసెంబర్ నెల బాగా అ కలిసివచ్చిన నెలగా ఇండస్ట్రీలో ఒక గట్టి నమ్మకం ఉంది.
ముఖ్యంగా 2002 సంవత్సరంలో డిసెంబర్లో విడుదలైన 'మన్మథుడు' సినిమా నాగార్జున కెరీర్లో ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా, నాగ్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత 2004లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్' సినిమా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించి, నాగార్జున మాస్ పవర్ ఏంటో నిరూపించింది. మళ్ళీ 2007లో అదే లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'డాన్' సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోయి హిట్ జాబితాలో చేరింది.
ఈ విజయాల పరంపర అక్కడితో ఆగలేదు. 2008లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'కింగ్' సినిమా నాగార్జునలోని కామెడీ టైమింగ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా నాగ్ మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచింది. వీటితో పాటు డిసెంబర్ నెలలోనే విడుదలైన 'రగడ', 'రాజన్న' వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. 'రగడ' కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా మెప్పిస్తే, 'రాజన్న' సినిమా నాగార్జునలోని నటుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇలా వరుసగా చూసుకుంటే నాగార్జున కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాలన్నీ డిసెంబర్ మాసంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఫలితాలను అందుకున్నాయి. అందుకే అక్కినేని అభిమానులు సైతం తమ హీరో సినిమా డిసెంబర్లో వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్ముతుంటారు.