రాజాసాబ్ పైసా వసూల్ బొమ్మ.. ఆ విషయంలో మారుతి సక్సెస్ అయ్యాడుగా!
ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీ నుంచి తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. నెక్స్ట్ లెవెల్ లో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో ప్రభాస్ ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. ప్రభాస్ నుంచి అభిమానులు ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో సినిమాలో అలాంటి అంశాలు ఉండబోతున్నాయని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ట్రైలర్ లో ప్రభాస్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం కొసమెరుపు. ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మారుతి నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ను ఎంచుకోవడంతో పాటు ప్రభాస్ డైలాగ్ డెలివరీ మాత్రం అదిరిపోయింది. అయితే సెకండ్ ట్రైలర్ లో హీరోయిన్లకు మాత్రం పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం వేరే లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.
థమన్ బీజీఎమ్ అదిరిపోయింది. ట్రైలర్ చివరి షాట్ లో జోకర్ గెటప్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ది రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. 2026లో విడుదల కానున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం గమనార్హం. మారుతి ఈ సినిమాతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.
ది రాజాసాబ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నాన్నమ్మ, తాతయ్య, మనవడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 2026 సంవత్సరానికి ఈ సినిమా శుభారంభాన్ని ఇవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వింటేజ్ ప్రభాస్ ను తెరపై చూపించే విషయంలో దర్శకుడు మారుతి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. ది రాజాసాబ్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.