‘శంబాల’ టీంకి అభినందనలు తెలిపిన రెబల్ స్టార్ ప్రభాస్
ఆది హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన ప్రతీ చోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘శంబాల’ టీం రాయలసీమలో సక్సెస్ టూర్‌లో బిజీగా ఉంది. ఇక ఇలా ‘శంబాల’ టీం తన దైన శైలిలో విజయయాత్రను కొనసాగిస్తూ ఉంటే.. రెబల్ స్టార్, మన డార్లింగ్ ప్రభాస్ తన విషెస్‌ను ‘శంబాల’ టీంకు తెలిపారు. ‘శంబాల’కి, ఆదికి ముందు నుంచీ ప్రభాస్ సపోర్ట్ ఉందన్న సంగతి తెలిసిందే.
‘శంబాల’ ట్రైలర్‌ని ప్రభాస్ రిలీజ్ చేయడంతో ఎంతగానో వైరల్ అయింది. అలా ప్రభాస్ హస్తవాసితో ‘శంబాల’కి ఇప్పుడు హిట్టు దక్కేసింది. ఇక ‘శంబాల’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, మంచి కలెక్షన్లు రాబడుతుండటంతో మరోసారి ప్రభాస్ తన విషెస్ అందించారు. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ఆదికి, శంబాల టీంకి కంగ్రాట్స్.. అని తన ఇన్ స్టాగ్రాంలో ప్రభాస్ పోస్ట్ చేశారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల అందించిన ఆర్ఆర్, ప్రవీణ్ కె బంగారి ఇచ్చిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ మూవీలో ఆదితో పాటుగా అర్చన ఐయ్యర్, ఇంద్రనీల్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ప్రియ, బేబీ చైత్ర, శివ కార్తిక్, మధు నందన్ పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. క్రిస్మస్ విన్నర్‌గా ‘శంబాల’ ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు