రష్మిక - విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?

Divya
టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉన్న ఈ జంట వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్ లో ఉన్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది .2025 అక్టోబర్ నెలలో విరి ఎంగేజ్మెంట్ జరిగిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటినుంచి రష్మిక కూడా ఏదో ఒక సందర్భంలో తన పెళ్లి గురించి, విజయ్ గురించి మాట్లాడుతూ ఉండడంతో ఇక వీరి వివాహం వచ్చేయేడాది ఉండబోతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు.




వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఈ సెలబ్రెటీలు వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారమైతే వినిపిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని ఉదయపూర్లో అటు కుటుంబ, సన్నిహితులు మధ్య ఈ వేడుక జరగబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన అటు విజయ్ దేవరకొండ కాని, రష్మిక కానీ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. రష్మిక పుష్ప , పుష్ప 2 చిత్రలతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించిన రష్మిక అదే జోరుని ఈ ఏడాది కూడా కొనసాగించింది. ప్రస్తుతం కాక్టైల్ 2, మైసా వంటి చిత్రాలలో నటిస్తోంది.


విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయక సరికొత్త లుక్ లో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గోదావరి యాసతో తన డైలాగు చెప్పిన విధానం సినిమా అంచనాలను పెంచేసింది. మరో సినిమా విషయానికి వస్తే రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ఒక పిరియాడిక్ యాక్షన్ సినిమాలో నటించబోతున్నారు. ఇందులో రష్మిక జోడిగా నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: