సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీరియల్ నటి ఆత్మహత్య..!
ముఖ్యంగా ఈమె తమిళంలో గౌరీ సీరియల్ ద్వారా మంచి క్రేజీ సంపాదించుకుంది. అలాగే కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈమె పోషించిన (దుర్గ, కనక ) పాత్రలు బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. నందిని గత కొద్ది రోజులుగా పీజీ లో ఉంటూ సీరియల్ షూటింగ్లకు హాజరయ్యేది. ఇటువంటి సందర్భంలోనే తల్లికి ఒక డెడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియగానే సంఘటన స్థలానికి చేరుకొని మరి ఆధారాలను సేకరించి , నటి మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపించారు.
నటీ నందిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన యువతిగా తెలుస్తోంది. నందిని మరణ వార్త విన్న గౌరీ సీరియల్ బృందం , స్నేహితులు, సన్నిహితులు సైతం షాక్ గురయ్యారు. నందిని కి ప్రస్తుతం పలు సీరియల్స్లలో చాలానే అవకాశాలు వస్తున్నాయి .కానీ ఇలాంటి సమయంలోనే నందిని ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రశ్నార్థకారంగా మారింది. నందిని ఆత్మహత్య పైన పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ గా మారింది.