ప్రభాస్ ఫ్యాన్స్ బాధ అర్ధం చేసుకున్న మారుతి..అందుకే ట్రైలర్ లో అవి చూపించాడా..?
ఇప్పటివరకు మారుతిని తక్కువ అంచనా వేసినవాళ్లు, ఆయన స్టైల్‌ను లైట్‌గా తీసుకున్నవాళ్లు చాలామందే ఉండొచ్చు. కానీ ఈ ట్రైలర్‌తో మారుతి తన వర్క్‌తోనే వాళ్లందరికీ గట్టి సమాధానం ఇచ్చారు. మాటలతో కాదు… స్క్రీన్‌పై కనిపించే విజువల్స్‌తో, ప్రభాస్ ప్రెజెన్స్‌తో, కథనంలోని కొత్తదనంతో అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే… ప్రభాస్‌ను ఇంత వెర్సటైల్‌గా, ఇంత ఫ్రెష్‌గా ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించలేదనే చెప్పాలి. కామెడీ, మాస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ – అన్నీ కలిపి ప్రభాస్‌ను ఒక పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మారుతి ప్రెజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టరిలర్ లాస్ట్ లో ప్రభాస్ లుక్స్ కెవ్వు కేక.. ఓ పక్క ఎమోషన్ మరో పక్క యాక్షన్ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం హైలెట్ గా మారింది.
ఇక ఈ ట్రైలర్‌తో ‘రాజా సాబ్’ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. థియేటర్స్‌లో ఈ సినిమా ఏ రేంజ్‌లో దుమ్ము లేపబోతోందో, బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేయబోతోందో చూడాలని ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ + మారుతి కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.