సాంగ్స్ ఓకే.. కానీ ఆ విషయంలో మన శంకర వరప్రసాద్ గారు గురించి టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సినిమాలు విడుదల కావడానికి రెడీ అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కూడా నిలవనుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి ఆఖరుగా వాల్టేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.


ఇక అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి మేకర్స్ ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.


ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ కి ఇప్పటికే 99 మిలియన్ వ్యూస్ దక్కగా , శశిరేఖా సాంగ్ కి 33 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా ఈ మూవీ సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉన్నా కూడా ఓ విషయంలో మెగా ఫాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఇప్పటికి ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయలేదు. అలాగే ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయలేదు. దానితో ఈ మూవీ ట్రైలర్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: