టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ మొదలు పెట్టిన కొత్తలో సిద్దు కి పెద్దగా గుర్తింపు రాలేదు. అలా చాలా సంవత్సరాల పాటు అయినా అనేక సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటిస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన డీజే టిల్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకోవడం , ఈ మూవీ లో సిద్దు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈయనకు ఒక్క సారిగా భారీ క్రేజీ వచ్చింది.
ఆ మూవీ తర్వాత సిద్దు "టిల్లు స్క్వేర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సిద్దు క్రేజ్ భారీగా పెరిగింది. కానీ ఆ తర్వాత ఈయన నటించిన జాక్ , తెలుసు కదా మూవీ లు వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం సిద్దు తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక సినిమాను కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సిద్దు తన తదుపరి మూవీ ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు అయినటువంటి స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సిద్దు నటించిన డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీలకి నాగ వంశీ నిర్మాత. ఆ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో సిద్దు , నాగ వంశీ కాంబో లో మరో మూవీ రూపొందితే దానిపై అద్భుతమైన అంచనాలు జనాల్లో ఏర్పడతాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.