సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది బ్యూటీలకు ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే మంచి అవకాశాలు దక్కుతాయి. అలాగే అద్భుతమైన క్రేజ్ కూడా వస్తూ ఉంటుంది. అలా అద్భుతమైన అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు వస్తూ ఉండడంతో వారి కెరియర్ సూపర్ సాలిడ్ గా ముందుకు సాగుతూ వెళుతున్న సమయంలో జనాలు కూడా వీరు ఇంకొంత కాలం మంచి సినిమాలు చేసి వాటితో విజయాలను అందుకుంటే స్టార్ హీరోయిని స్థాయికి వెళతారు. ఆ తర్వాత వీరిని ఆపడం కష్టం అనే అభిప్రాయాలను కూడా కొంత మంది ముద్దు గుమ్మల విషయంలో వ్యక్తం చేస్తూ ఉంటారు.
కానీ అలా జెట్ స్పీడులో దూసుకుపోయే హీరోయిన్లకు కూడా కొన్ని సందర్భాలలో బ్రేకులు పడుతూ ఉంటాయి. దానితో వారి కెరియర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగదు. అలా సూపర్ సాలిడ్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఓ చిన్న కారణంతో ఓ బ్యూటీ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్త కష్టాలను ఎదుర్కొంటున్న బ్యూటీ ఎవరు అయినా ఉన్నారు అంటే అందులో నబా నటేష్ ఒకరు. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే మంచి సినిమా అవకాశాలను దక్కించుకొని అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అలా అద్భుతమైన దశలో కెరియర్ను పొందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమెకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఈమె కొంత కాలం క్రితమే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం ఈమె నటించిన డార్లింగ్ అనే సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధిస్తే మళ్లీ ఈమె అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకొని వరుస పెట్టి సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలను అవకాశాలు దక్కించుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.