బొంబాయికి రాను పాటకు కోటి ఆదాయం పై నోరు విప్పిన డాన్సర్ లిఖిత..!

Divya
గత కొంతకాలంగా యూట్యూబ్లో భారీ సక్సెస్ అందుకున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్ లలో రాను బొంబాయికి రాను పాట కూడా ఒకటి. ఈ పాట యూట్యూబ్లోనే సంచలనం గా మారింది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటకి రీల్స్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ పాటలో కనిపించిన రామురాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క పాటతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇందులో వీరిద్దరూ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ పాటకి ఇచ్చిన రెమ్యూనరేషన్, అలాగే వచ్చిన ఆదాయం పైన తాజాగా లిఖిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు విషయాలను పంచుకుంది.


లిఖిత మాట్లాడుతూ తన స్వస్థలం శ్రీకాకుళం , కాని తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని తెలిపింది. క్రేజీ డాన్స్ స్టూడియోలో తను డాన్స్ రీల్స్ చేస్తూ ఈ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపింది. రాను బొంబాయి కి రాను అనే సాంగ్ షూటింగ్ ను కూడా కేవలం ఒక్కరోజులోనే పూర్తి చేశామని తెలిపింది. ఈ పాట కోసం చేసిన రిల్ కు కేవలం ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ వచ్చాయని దీంతో అందరం ఆశ్చర్యపోయామని, ఆ క్రేజ్ తోనే పాటని మొత్తం కేవలం రెండు రోజుల్లో పై పూర్తి చేశామని తెలిపింది.


ఈ పాటకి కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందనే విషయం నిజమేనని, డాన్సర్ రాము విల్లా , పెద్ద పెద్ద కార్లు కొన్నారని వస్తున్న వార్తలు నిజం కాదంటూ తెలియజేసింది అలాగే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. రెండు రోజులకు తాము ముందుగా ఎంత మాట్లాడుకున్నామో అంతే ఇచ్చారని, లాభాలు వచ్చాయని తాము ఎక్కువ అడగలేదు. ముందు ఎంత చెప్పామో అంతే తీసుకుంటామని తెలిపింది. ఈ పాటకు రాము రాథోడ్ లిరిక్స్ చక్కగా అందించారు , కళ్యాణ్ కిస్ సంగీతం అందించారని, తన సొంత డబ్బులతోనే రాము రాథోడ్ ఈ పాటను తెరకెక్కించారంటు లిఖిత తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: