శ్రీలీల వర్సెస్ పూజా హెగ్డే: కత్తిలాంటి హీరోయిన్స్ మధ్య ‘డూ ఆర్ డై’ వార్..!?
ఈ క్రమంలో ‘బుట్టబొమ్మ’గా ప్రేక్షకుల మనసులు దోచుకున్న పూజా హెగ్డే ఆశలన్నీ ఇప్పుడు విజయ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘జన నాయగన్’ మీదే పెట్టుకుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన కొన్ని తమిళ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది దళపతి విజయ్ చివరి సినిమా కావడం వల్ల అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన హైప్ ఉంది.బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా, ఈ సినిమాలో పూజా పాత్ర చాలా కీలకం అని సమాచారం. గతంలోలాగా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఈసారి తన నటనతోనూ ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరం పూజాపై ఉంది. కథలో బలమైన పాత్ర, ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయితే, పూజా హెగ్డే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించే అవకాశం ఇదేనని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్‌తో నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తే, మళ్లీ టాప్ హీరోయిన్ల రేసులో పూజా పేరు గట్టిగా వినిపించడం ఖాయం.
మరోవైపు, తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించిన శ్రీలీల కూడా ఇప్పుడు కెరీర్ పరంగా కీలక దశలో ఉంది. ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, యూత్‌ఫుల్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు ‘పరాశక్తి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటల్లో శ్రీలీల ఎనర్జీ చూస్తుంటే — ఈసారి ఆమె చాలా స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసి ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.ఇంతవరకు శ్రీలీలను ఎక్కువగా డ్యాన్స్‌లు, గ్లామర్, స్పీడ్ పెర్ఫార్మెన్స్‌లకే పరిమితం చేసినా, ఈ సినిమాలో మాత్రం తనలోని నటిని పూర్తిగా బయటకు తీసుకురావాలని ఆమె తహతహలాడుతున్నట్లు టాక్. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కాకుండా, యాక్టింగ్ పరంగానూ తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ‘పరాశక్తి’ ద్వారా వస్తే, శ్రీలీల కెరీర్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం.
ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ పోటీ తీవ్రమవుతోంది. కొత్త హీరోయిన్లు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, బలమైన మహిళా పాత్రలు… ఇలా పరిస్థితులు వేగంగా మారుతున్న ఈ సమయంలో, పూజా హెగ్డే మరియు శ్రీలీలకు రాబోయే పండుగ సీజన్ నిజంగా ‘డూ ఆర్ డై’ లాంటిదే. ఈ సినిమాల్లో ఏదైనా ఒకటి భారీ విజయం సాధిస్తే, ఈ ఇద్దరు భామల కెరీర్‌కు మళ్లీ కొత్త ఊపొస్తుంది. లేకపోతే, అవకాశాలు ఉన్నా క్రేజ్ మాత్రం తగ్గే ప్రమాదం లేకపోలేదు.అందుకే… ఈసారి బాక్సాఫీస్ దగ్గర గెలుపే లక్ష్యంగా, తమ ప్రతిభ మొత్తం బయటపెట్టేందుకు పూజా హెగ్డే, శ్రీలీల సిద్ధమవుతున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరి లక్ మారుతుంది? అన్నది చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!