ప్రభాస్ ని జోకర్ గా మారుతీ చూపించడానికి కారణం అదేనా..?
ది రాజా సాబ్ రెండో ట్రైలర్‌ను మేకర్స్ భారీ హైప్‌తో రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దర్శకుడు మారుతీ ప్రభాస్‌ను చూపించిన విధానం అభిమానులను బాగా ఎగ్జైట్ చేసింది. అయితే ట్రైలర్ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. లాస్ట్ సీన్‌లో ప్రభాస్‌ను జోకర్ గెటప్‌లో చూపించిన క్షణం ఫ్యాన్స్‌కు నిజంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆ లుక్ వైరల్ అవుతూ, ప్రభాస్ మళ్లీ తన ఇమేజ్‌ను బ్రేక్ చేసి కొత్తగా ట్రై చేయడానికి సిద్ధమయ్యాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక లుక్ మాత్రమే కాదు… ప్రభాస్ తన పాత్రకు ఎంత డెడికేషన్‌తో పనిచేశాడో చెప్పే స్టేట్‌మెంట్ లాంటిది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. లుక్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాయి. ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నప్పటికీ, ఇలాంటి విభిన్నమైన గెటప్‌ని ఎంచుకోవడం అంటే నిజంగా రిస్క్ తీసుకున్నట్టే. కానీ అదే ప్రభాస్‌ను మిగతా హీరోలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతోంది.ఇప్పుడు ప్రభాస్‌ను జోకర్ లుక్‌లో చూపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని, ఎగ్జైట్‌మెంట్‌ను పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అసలైన సవాల్ మాత్రం దర్శకుడు మారుతీ ముందే ఉంది. ఈ జోకర్ గెటప్ కేవలం షాకింగ్ ఎలిమెంట్‌గా కాకుండా, కథలో భాగంగా ఎంత స్ట్రాంగ్‌గా జస్టిఫై అవుతుందన్నదే కీలకం. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సీక్వెన్స్‌ను ఎలా తీసుకుంటారు? ఆడియెన్స్‌కు ఈ లుక్, ఈ క్యారెక్టర్ కన్వీన్సింగ్‌గా అనిపిస్తుందా? అన్నది పూర్తిగా స్క్రీన్‌ప్లే, రైటింగ్, ప్రెజెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ సీన్‌కు పూర్తి న్యాయం జరిగితే మాత్రం, సినిమా రిలీజ్ తర్వాత ఈ జోకర్ అవతార్ ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయిగా మారే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ప్రత్యేకమైన సీక్వెన్స్‌ని మారుతీ ఎలా డిజైన్ చేశాడు, కథలో దానికి ఎంత వెయిట్ ఇచ్చాడు అన్నది రిలీజ్ వరకు ఆగి చూడాల్సిందే. ఒక విషయం మాత్రం క్లియర్ — ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ మరోసారి తనపై వచ్చిన కామెంట్స్‌కి పనుల ద్వారానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.