ఆ సినిమా వల్ల కోట్లు నష్టపోయా..బన్నీవాసు షాకింగ్ కామెంట్స్..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా బన్నీ వాసు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒకవైపు నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాసు, ప్రియదర్శి హీరోగా నటించిన మిత్రమండలి సినిమా విషయంపై మాట్లాడుతూ కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిందంటూ తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.




నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో, హీరోయిన్లుగా నటించిన మిత్రమండలి సినిమా ఫ్లాప్ అయ్యిందని తెలిపారు. సినిమా పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో అందరం కలిసే చూసాము సినిమా బాగానే అనిపించింది. దీంతో థియేటర్లలో కూడా ప్రేక్షకులు ఈ సినిమా చూసి నవ్వుకుంటారు అనుకున్నాము. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రేక్షకులతో పాటు తాను కూడా సినిమా చూశాను కానీ వారికి నవ్వు అనేది ఎక్కడ కనిపించలేదని నేను అంచనా పెట్టుకున్న సీన్స్ కూడా వారిని మెప్పించలేకపోయాయంటూ తెలిపారు. అలా మొదటిసారి మా అంచనా కూడా తప్పైందని అర్థమయిందని తెలిపారు బన్నీ వాసు.


ఫైనల్ కాపీని విడుదల చేయడానికి ముందే మరొకసారి చూసి ఉండి ఉంటే బాగుండేదేమో అనుకున్నాము.. కానీ కుదరలేదు ఈ సినిమా వల్ల రూ.6 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని తెలిపారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలై 20 రోజులలోనే ఓటీటిలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని రూ.15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఓటీటి రైట్స్, కలెక్షన్స్ అన్నీ కలుపుకొని కేవలం రూ .9 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టిందని, రూ .6 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: