**ఘనంగా మాస్టర్ మహేంద్రన్ "నీలకంఠ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.*

RAMAKRISHNA S.S.
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా



*కొరియోగ్రాఫర్ సాగర్ మాట్లాడుతూ -*  ఈ సినిమాతో ఒక మంచి టీమ్ తో వర్క్ చేసే అవకాశం వచ్చింది. సాంగ్స్ ఆడియెన్స్ విజిల్స్ వేసేలా ఉన్నాయి. "నీలకంఠ" చిత్రంతో మా ప్రొడ్యూసర్ గారికి భారీ కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.



*లిరిసిస్ట్ కృష్ణ మాట్లాడుతూ -* సినిమాలో పాటలు రాయాలనేది నా కల. ఆ కల "నీలకంఠ" చిత్రంతో నిజమవుతోంది. ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ గారి మీద చిత్రీకరించిన జర సైగ చేసి చూడు అనే పాటకు లిరిక్స్ రాశాను. ఈ పాటను గీతా మాధురి పాడారు. ఫస్ట్ సాంగ్ కే స్నేహా ఉల్లాల్ లాంటి హీరోయిన్, గీతా మాధురి లాంటి సింగర్ కాంబినేషన్ రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.



*ఎడిటర్, డీవోపీ శ్రావణ్ జి. కుమార్ -* ఒక స్క్రిప్ట్ రాయడం సులువు. కానీ ఆ స్క్రిప్ట్ ను మన ఊహకు తగినట్లు స్క్రీన్ మీదకు తీసుకురావడం ఈజీ కాదు. మా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము "నీలకంఠ" మూవీని అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాం. మా డైరెక్టర్ తో పాటు మా ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. మాస్టర్ మహేంద్రన్ కు సినిమా అంటే చాలా ప్యాషన్. ఆయన హీరోగా పెద్ద స్థాయికి వెళ్తారనే నమ్మకం ఉంది. అన్నారు.



*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ మాట్లాడుతూ -* "నీలకంఠ" మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. జనవరి 2న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మా సినిమాను నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. సాంగ్స్ విని వెంటనే ఒక మంచి ప్రైస్ ఇచ్చి ఆదిత్య మ్యూజిక్ వాళ్లు తీసుకున్నారు. సినిమా ప్రారంభం నుంచే మీరు కథలో లీనమవుతారు. క్లైమాక్స్ హైలైట్ గా ఉంటుంది. రియల్ లొకేషన్స్ లో అక్కడి లోకల్ టాలెంట్ ఆర్టిస్టులుగా మా సినిమాను రూపొందించాం. అన్నారు.



*నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ -* "నీలకంఠ" సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి పాత్ర నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. మా డైరెక్టర్ రాకేష్ గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎప్పుడూ మూవీ గురించే మాట్లాడుతుంటారు. ఆయనతో పాటు మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్ గారికి ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలి. మాస్టర్ మహేంద్రన్ పేరు ముందు మాస్టర్ కాకుండా స్టార్ ట్యాగ్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.



*నటుడు శివ మాట్లాడుతూ -* ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. కీ ఆర్టిస్టులతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. జనవరి 2న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. ఆది సాయికుమార్ గారు మా సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.



*హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ -* నేను ఈ ఈవెంట్ కు ఎల్ఎస్ ప్రొడక్షన్స్ లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా వచ్చాను. ఈ సంస్థలో నేనొక వెబ్ సిరీస్ చేశాను. ఐదు భాషల్లో అది స్ట్రీమింగ్ కు రాబోతోంది. శ్రీనివాసులు, వేణుగోపాల్ లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో కొనసాగాలి. వాళ్లకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఆ ప్యాషన్ ఇప్పుడు "నీలకంఠ" మూవీ ఔట్ పుట్ లో కనిపిస్తోంది. మాస్టర్ మహేంద్రన్ ఇక మాస్టర్ కాదు ఈ చిత్రంతో ఒక మంచి యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటారు. అన్నారు.



*నటుడు మనీష్ గిలాడ మాట్లాడుతూ -* "నీలకంఠ" మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. జనవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.



*నటుడు మాగంటి శ్రీనాథ్ మాట్లాడుతూ -* శంబాలతో హిట్ కొట్టిన ఆది గారికి కంగ్రాట్స్. "నీలకంఠ" మూవీ కంటెంట్ చాలా బాగుంది. మాస్టర్ మహేంద్రన్ పర్ ఫార్మెన్స్, ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మనం దేవి, సింహాద్రి మూవీస్ లో బాల నటుడిగా ఆయన పర్ ఫార్మెన్స్ చూశాం. ఆయన తెలుగు సినిమా మీద ప్యాషన్ తో తెలుగు నేర్చుకుని ఇక్కడ నటించారు. మేము కూడా ఇతర భాషల్లోకి వెళ్లేలా ఇన్స్ పైర్ చేస్తున్నారు. "నీలకంఠ" మూవీతో న్యూ ఇయర్ లో ఇండస్ట్రీకి మంచి సక్సెస్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ ప్రశాంత్ మాట్లాడుతూ -* "నీలకంఠ" మూవీ ఆడియోను తీసుకున్న ఆదిత్య వారికి నా కృతజ్ఞతలు. మా హీరో హీరోయిన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల నా పాటలు మూవీలో మరింత బ్యూటిఫుల్ గా వచ్చాయి. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు మూవీని చూశాను. "నీలకంఠ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాం. ఈ సినిమా చూసిన వారు బీజీఎం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతారు. అన్నారు.



*ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ -* మా మూవీ ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన ఆది, ఆకాష్ గారికి, ఇతర అతిథులకు థ్యాంక్స్. మేము ఈ సినిమా కంటే ముందు ఒక వెబ్ సిరీస్ చేశాం. సినిమా కూడా నిర్మించాలనే ప్యాషన్ తో "నీలకంఠ" నిర్మించాం. మాస్టర్ మహేంద్రన్ సింగిల్ టేక్ హీరో. అలాగే మా హీరోయిన్ యష్న బాగా నటించింది. రాకేష్ కొత్త దర్శకుడు. ఇంత బాగా మూవీని రూపొందిస్తాడని మేము అనుకోలేదు. ప్రశాంత్ ఇచ్చిన ఆర్ఆర్ మీకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. శ్రావణ్ బ్యూటిఫుల్ విజువల్స్ మూవీకి ఇచ్చారు. మూవీని ఎగ్జిక్యూట్ చేసిన అనిల్, ఇతర టీమ్ అందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా. "నీలకంఠ" సినిమా తప్పకుండా ప్రేక్షకులందరి ఆదరణ పొందుతుంది. అన్నారు.



*ప్రొడ్యూసర్ వేణుగోపాల్ దీవి మాట్లాడుతూ -* శంబాలతో హిట్ కొట్టిన ఆది గారికి మా అందరి తరుపున కంగ్రాట్స్. మా "నీలకంఠ" సినిమాకు అందరూ కొత్త వాళ్లే వర్క్ చేసినా వాళ్లంతా చాలా ప్రతిభ గలవారు. మూవీలో వారి టాలెంట్ ను చూస్తారు. జనవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.



*డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ -* కొత్త దర్శకుడిని అయినా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్ గారికి థ్యాంక్స్. వాళ్లు నాతో సినిమా చేస్తానని చెప్పిన ఒక్క మాటను నిలబెట్టుకుంటూ భారీ బడ్డెట్ తో సినిమా చేశారు. మాస్టర్ మహేంద్రన్ ఒక బ్రదర్ లా సపోర్ట్ చేశాడు. నేను ఇమాజిన్ చేసుకున్న సీత క్యారెక్టర్ కు యష్న పర్పెక్ట్ గా కుదిరింది. యాటసిరి, కోట, నాయుడుపేట అనే మూడు ఊర్లలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడి స్థానిక ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ లో నటించారు. ఇదొక గెలిచిన వ్యక్తి కథ. సినిమా చూస్తున్నప్పుడు ఆ గెలుపు మీది అనుకుంటారు. మా మూవీలో యాక్షన్, లవ్, ఎమోషన్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. కమర్షియల్ గా ఉంటూనే విద్య ఎంత ముఖ్యం అనే మంచి విషయాన్ని చెప్పాం. ఈ సినిమా మా అందరికీ పేరు తీసుకొస్తుంది. అన్నారు.



*హీరోయిన్ యష్న ముతులూరి మాట్లాడుతూ -* రియల్ లొకేషన్స్ లో రియల్ ఎమోషన్స్ తో ఉండే చిత్రమిది. ఈ సినిమాలో నేను సీత క్యారెక్టర్ లో నటించాను. శివుడు హాలాహలం తాగినప్పుడు ఆయన శరీరమంతా ఆ విషం నిండకుండా పార్వతీదేవి గొంతు దగ్గరే ఆపిందట. అలా నేను హీరో క్యారెక్టర్ కు చిన్న సపోర్ట్, బలాన్ని ఇస్తుంటాను. తెలుగు అమ్మాయినైన నాకు ఈ మూవీలో హీరోయిన్ గా అవకాశం రావడం హ్యాపీగా ఉంది. సీత లాంటి క్యారెక్టర్స్ నేను చేయాలని మా అమ్మ కోరిక. టాలెంటెడ్ టీమ్ మా మూవీకి వర్క్ చేసింది. "నీలకంఠ" సినిమాకు మీరంతా ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. అన్నారు.



*హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ -* తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. ఆది నాకు మంచి ఫ్రెండ్. శంబాల హిట్ తో సాయికుమార్ గారు గర్వపడేలా విజయాన్ని అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. నాకు సినిమానే ప్రపంచం. చాలా పోటీ ఉంది, కొత్త హీరోలు వస్తున్నారు అని నాతో సన్నిహితులు చెబుతుంటారు. కానీ నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలి అనేది ఒక్కటే నాకు తెలిసింది. నీలకంఠ సినిమాకు మా టీమ్ అంతా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ప్యాషనేట్. వాళ్లు సెట్ లేకుండా ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. డైరెక్టర్ కొత్త అయినా టాలెంటెడ్. అతను ఇచ్చిన నెరేషన్ తోనే ఎంత టాలెంటెడ్ అనేది తెలిసింది. యష్న సీతగా ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.



*హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ -* మహేంద్రన్ దేవి సినిమా నుంచే తన నటనతో మనకు దగ్గరయ్యాడు. ఆ సినిమాను నేను ఫ్యామిలీతో కలిసి చాలాసార్లు టీవీలో చూశాను. అప్పటినుంచి తన ప్రయత్నం చేస్తూ ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మహేంద్రన్ తో పాటు టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.



*హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ -* మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్. మేము చెన్నైలో పాండియన్ అనే మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. మాతో పాటు సూర్య, కార్తి, ఆర్య గారు కూడా పాండియన్ గారి దగ్గర ఫైట్స్ నేర్చుకునేవారు. మహేంద్రన్ మంచి యాక్టర్. మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారి చిన్నప్పటి రోల్ లో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్, డైరెక్టర్ రాకేష్, హీరోయిన్ యష్న, ఇంకా నీలకంఠ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను జనవరి 2న థియేటర్స్ చూసి హిట్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూఇయర్. అన్నారు.



*నటీనటులు -* మాస్టర్ మహేంద్రన్, నేహా పఠాన్, యష్న ముతులూరి, రాంకీ, స్నేహా ఉల్లాల్, శుభలేక సుధాకర్, 30 ఇయర్స్ పృథ్వీ, చిత్రం శ్రీను, అఖండ శివ, కంచెరపాలెం రాజు, సురభి ప్రభావతి, సత్య ప్రకాశ్, కిరాక్ ఆర్పీ, భరత్ రెడ్డి, రాజు, అప్పాజీ, తదితరులు



*టెక్నికల్ టీమ్*
*-------------* -------
ఆర్ట్ - నాని పండు, సతీష్ శెట్టి
కొరియోగ్రాఫర్స్ - సాగర్, శివ గిరీష్
యాక్షన్ - రవి
డీవోపీ, ఎడిటింగ్ - శ్రావణ్ జి.కుమార్
మ్యూజిక్ - మార్క్ ప్రశాంత్
సమర్పణ - శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి
బ్యానర్స్ - ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్
ప్రొడ్యూసర్స్ - మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి
రచన, దర్శకత్వం - రాకేష్ మాధవన్
పీఆర్ఓ - సుబ్బారావు కిలారి
డిజిటల మార్కెటింగ్ - స్టార్ సర్కిల్



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: