కనీసం 2026 లో అయిన మన తెలుగు హీరోలు అలా చేస్తే బాగుండు..ఇండస్ట్రీ బాగుపడుతుంది..!

Thota Jaya Madhuri
ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల్లో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. “2026లో అయినా సరే మన తెలుగు హీరోలు ఈ పని చేస్తే బాగుంటుంది” అంటూ నెటిజన్లు, సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.2025 సంవత్సరం కొంచెం ఇష్టం, కొంచెం కష్టం మధ్యలో సక్సెస్‌ఫుల్‌గా ముగిసిపోయింది. పలు హిట్ సినిమాలు వచ్చినప్పటికీ, అదే సమయంలో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని బడా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బొక్కబోర్లా పడ్డాయి. దీంతో 2025కి టాటా బై బై చెప్పి, 2026కి ఘనంగా వెల్కమ్ చెప్పారు సినీ ప్రేక్షకులు.

ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం ఒకే మాటపై చర్చిస్తోంది. “2026లో అయినా సరే మన తెలుగు స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటే బాగుంటుంది” అని నెటిజన్లు గట్టిగా అంటున్నారు. హీరోల భారీ రెమ్యునరేషన్ కారణంగా సినిమా బడ్జెట్ అనవసరంగా పెరిగిపోతోందని, దాంతో మేకర్స్, ప్రొడ్యూసర్స్ తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన అనేక భారీ బడ్జెట్ సినిమాలు, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి, చివరికి డిజాస్టర్లుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు, చివరికి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం మొత్తం ఇండస్ట్రీ మీద పడుతోంది.

అందుకే 2026లో అయినా సరే, కొందరు సో కాల్డ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాల వైపు కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టితే బాగుంటుంది అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కథ బలంగా ఉంటే, చిన్న బడ్జెట్‌లో కూడా పెద్ద విజయం సాధించవచ్చని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు నిరూపించాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారీ బడ్జెట్ సినిమాల కారణంగా టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోంది. దానికి మళ్లీ ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొని, ఆ భారాన్ని నేరుగా ప్రేక్షకులపై మోపుతున్నారు. ఇది సామాన్య ప్రేక్షకుడికి ఆర్థికంగా భారంగా మారుతోంది. సినిమా చూడాలంటేనే భయపడే పరిస్థితి వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందుకే హీరోలు తమ రెమ్యునరేషన్‌ను కొంత తగ్గించుకొని, కథపై ఎక్కువగా ఫోకస్ చేస్తే హీరోలకు, ప్రొడ్యూసర్లకు, ప్రేక్షకులకు – అందరికీ మేలు జరుగుతుంది అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. దీని వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా ఆర్థికంగా బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చిన్న ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్ల మధ్య జరిగిన వివాదాలు, మార్లు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ తరహా సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే, ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు తమ పారితోషికాల విషయంలో కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.

మరి 2026లో అయినా సరే ఈ స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చేస్తారా? లేదా మళ్లీ అదే భారీ బడ్జెట్, అదే అతి అంచనాల మధ్య సినిమాలు తీస్తారా? అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: