టాలీవుడ్
ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో
మాస్ మహారాజా
రవితేజ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లు చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం
రవితేజ నటించిన చాలా సినిమాలు వరుస పెట్టి భారీ ఆపజయాలను అందుకున్నాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. తాజాగా
రవితేజ ,
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన
భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే
సినిమా లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో డింపుల్ హయాతి , ఆశికా
రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ
మూవీ తర్వాత
రవితేజ ,
శివ నిర్వాన దర్శకత్వంలో ఓ
సినిమా చేయబోతున్నట్లు , ఆ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విలువడనున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
రవితేజ ,
శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందబోయే తర్వాత సినిమాను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగు
సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ దర్శకుడిగా ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వివేక
ఆత్రేయ దర్శకత్వంలో
రవితేజ ఓ
సినిమా చేయబోతున్నట్లు , ఇప్పటికే
వివేక్ ఆత్రేయ ఒక కథను
రవితేజ కు చెప్పగా , అది
రవితేజ కు బాగా నచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ కాంబో
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువలనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.